Thursday, May 2, 2024
- Advertisement -

భోజనం తర్వాత నడక..మంచిదేనా?

- Advertisement -

వ్యాయామం, నడక ప్రతిరోజు మన దిన చర్యలో భాగం చేస్తే అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం. మరి ముఖ్యంగా షుగర్ వంటి వ్యాధులు దరిచేరవు.షుగర్ వ్యాధి ఉన్నవారికి నడక చక్కటి పరిష్కార మార్గం. మానసిక స్థితిని బలపరచడంలోనూ, ఒత్తిడిని తగ్గించడంలోనూ ఎంతో సాయపడుతుంది.

అయితే భోజనం తర్వాత నడక మంచిదేనా అన్న సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఓ స్టడీలో లంచ్ మరియు డిన్నర్ తర్వాత నడిస్తే మధుమేహానికి చెక్ పెట్టవచ్చని తేలింది. భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది.

అలాగే బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్లు నడిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించడంలో నడక ఎంతోగానో ఉపయోగ పడుతుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. అందుకే నడకకు ప్రతిరోజూ తప్పనిసరిగా సమయం కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -