Friday, April 26, 2024
- Advertisement -

దుబ్బాక లో మోగిన ఎన్నికల సమర శంఖం..?

- Advertisement -

అధికార పార్టీ, స్థానిక తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి తో సిద్దిపేట జిల్లా, దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల బరిలోకి దిగేందుకు అధికార పార్టీ తెరాస, కాంగ్రెస్, బీజేపీ లు ఇప్పుడు సిద్దం అవుతున్నాయి.

అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ లో ఆయా పార్టీలు తల మునకలు అయింది. అయితే ఈ దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణ కి సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే షెడ్యూల్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 9 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుండి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానున్నాయి.

అక్టోబర్ 16 న నామినేషన్లకు చివరి తేదీ, అక్టోబర్ 17 న నామినేషన్ లని పరిశీలిస్తారు, అక్టోబర్ 19 న వేసిన నామినేషన్ ల ఉపసంహరణకు గడువు. నవంబర్ 3 న పోలింగ్ జరగనుం ది. అదే నెల 10 వ తేదీన కౌంటింగ్ జరగనున్నట్లు షెడ్యూల్ లో తెలపడం జరిగింది. అయితే 56 అసెంబ్లీ స్థానాలతో పాటుగా, ఒక ఎంపీ సీటు కి ఎన్నికలు జరగనున్నాయి అని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -