Friday, April 26, 2024
- Advertisement -

విజయ్ మాల్యా పాస్‌పోర్టు రద్దు

- Advertisement -

బ్యాంకులకు రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా పాస్‌పోర్టును కేంద్రం రద్దు చేసింది. రెండు రోజుల క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.

శుక్రవారం నాడు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ మేరకు మాల్యా పాప్‌పోర్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాల్యాను భారత్ కు రప్పించేందుకు మార్గం సుగమం అయ్యింది.

మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన రుణం వడ్డీతో కలిపి 9 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ రుణాల సెటిల్‌మెంట్లకు సంబంధించి ఆయన ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -