విజయారెడ్డి హత్య.. రెవెన్యూ అధికారులను బెంబేలెత్తిస్తున్న రైతులు

862
Vijaya Reddy Death Effect…Farmers fires on revenue officials
Vijaya Reddy Death Effect…Farmers fires on revenue officials

తహసీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత సమాజం రెండు రకాలుగా స్పందించడం నివ్వెరపరుస్తోంది. రెవెన్యూ ఉద్యోగులంతా జరిగిన ఈ దారుణాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తుంటే.. ఓవైపు రెవెన్యూ శాఖతో ముప్పుతిప్పలు పడుతున్న రైతులంతా ఇప్పుడు నిందితుడు సురేష్ బాటలో నడుస్తుండడం కలకలం రేపుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తనకు పట్టదారు పాసుపుస్తకం ఇవ్వలేదని ఓ యువరైతు మంచిర్యాల తహసీల్దార్ ఆఫీసుకు పెట్రోల్ బాటిల్ తో వచ్చి పోసుకొని చస్తాను అంటూ బెదిరించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

అది మరిచిపోకముందే శ్రీకాకుళం జిల్లా అముదాలవలసలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఆముదాలవలసలోని పూజారిపేటలో గురువారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల్లో కింతలి గ్రామానికి చెందిన 70 మంది రైతులు పాల్గొని తమకు రైతు భరోసా అందడం లేదని నిరసించారు. ఇలా తిప్పించుకోవడం వల్లే అధికారులపై దాడులు చేస్తున్నారని రైతులు తహసీల్లార్ ను హెచ్చరించడం కలకలం రేపింది. తెలంగాణలో అందుకే చంపేశారని తిట్టిపోశారు.

దీంతో తహసీల్దార్ రామకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయి స్పీకర్ తమ్మినేని తనయుడిని కలిసి కన్నీరు పెట్టుకోవడం విశేషం. ఇలా తెలంగాణలో తహసీల్దార్ హత్య తర్వాత అధికారుల మామూళ్లు, భూదందాలపై రైతులు, ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడడం కలకలం రేపుతోంది.

Loading...