కళ్యాణ్ బాబూ నీకోసమే ఎదురు చూస్తున్నా : మాధవీలత

2346
actress madhavi latha interesting comments on pawan kalyan over janasena bjp alliance
actress madhavi latha interesting comments on pawan kalyan over janasena bjp alliance

జనసేన, బీజేపీ కలిసిపోయాయి. బీజేపీతో జనసేన పొత్తుని అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, బీజేపీ-జనసేన భావజాలం ఒక్కటే అని పవన్ అన్నారు. అయితే జనసేన-బీజేపీతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేసి డిపాజిట్లను గల్లంతు చేసుకున్నారు.

అయితే ముందు నుంచి పవన్ అంటే మంచి అభిమానం ఉన్న మాధవీలత.. జనసేన-బీజేపీ పొత్తును స్వాగతిస్తూ ఆమె ఫేస్ బుక్‌లో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను బీజేపీలో చేరినప్పుడు తనని జనసైనికులు తిట్టిన విషయంను గుర్తు చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డియర్ పవన్ కళ్యాణ్ అభిమానులు.. నేను ఎప్పుడైన సరైన నిర్ణయాలే తీసుకుంటా అని నాకు నమ్మకం. నా బలుపు కూడా అదే. చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను బీజేపీలో చేరినప్పుడు నన్ను హేట్ చేశారు. ఇప్పుడు చూడండి.. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

నాకు ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ ఏదో రోజు బీజేపీకి సపోర్ట్ చేస్తారని. బీజేపీ-జనసేన కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్డ్ దిస్. లేట్ అయినా లేటెస్ట్ డెసిషన్. అదిరిందయ్యా కళ్యాణ్ బాబూ అంటూ పోస్ట్ పెట్టారు మాధవీలత. మరో ఫోస్ట్ లో ‘ఇదే కదా 18 నెలలుగా నా కల, కోరిక, ఆశ. హమ్మయ్య. అయ్యిందిగా’ అంటూ బీజేపీకి పవన్ సపోర్ట్ చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తోంది మాధవీలత. అయితే ఆమె ఫోస్ట్ పై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Loading...