Friday, April 26, 2024
- Advertisement -

ప్ర‌త్యేక హోదా ఇచ్చితీరుతాం…. రాహుల్‌

- Advertisement -

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ ప్ర‌ధాని మోదీపై నిప్పులు చెరిగారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో మోదీ విఫ‌లం అయ్యార‌ని మండిప్డారు. కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన వెలంట‌నే ప్ర‌త్యేక హోదాను ప్ర‌క‌టిస్తామ‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అన్నది తమకు సమస్య కాదన్నారు. తిరుపతిలో కాంగ్రెస్ హోదా భరోసాయాత్ర బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలో ‘భరోసా యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంత‌కు ఉందు కాలిన‌డ‌క‌న తిరుమ‌ళ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు . ప్రత్యేక హోదా ఇస్తామని ఆ నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని ఆ హామీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీగా పరిగణించకూడదని భారత ప్రధాని ఇచ్చినట్లుగా గౌరవించాలని సూచించారు.

తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చిన ప్రధాని ఎన్నికల అనంతరం ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. ప్రత్యేక హోదాతోపాటు ఏడాదికి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని అది ఏమైందన్నారు. జన్ ధన్ యోజన పథకం ద్వారా ప్రతీ అకౌంట్ లో రూ.15వేలు అకౌంట్లో జమ చేస్తామని చెప్పిన మోదీ ఎవరి అకౌంట్లో అయినా వేశారా అని నిలదీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -