Friday, April 26, 2024
- Advertisement -

అనుకున్న‌దే జ‌రిగింది…. వైసీపీలోకి మ‌రో ఎంపి…

- Advertisement -

అనుకున్న‌దే అయ్యింది. టీడీపీకీ మ‌రో ఎంపీ గుడ్‌బాయ్ చెప్పారు.టీడీపీకీ ఎమ‌య్యిందో గాని వ‌రుస‌గా పార్టీని వీడ‌తున్నారు నాయ‌కులు. మేడా, అమంచి, ఎంపీ అవంతి పార్టిని వీడ‌క ముందే మ‌రో ఎంపీ వారిబాటలో న‌డిచేందుకు సిద్ద‌మ‌య్యారు. పార్టీ మారుతున్నార‌నే వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు పార్టీ మారం…పీక కోసుకుంటాం…చివ‌రి వ‌ర‌కు ఉన్న పార్టీలోనే ఉంటా అని స్పీచ్ ఇచ్చే నాయ‌కులు మ‌రోస‌టి రోజే ప్లేటు ఫిరాయిస్తున్నారు. ఇది అన్ని పార్టీల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

అమలా పురం ఎంపీ పండుల ర‌వీంద్ర బాబు టీడీపీకీ గుడ్ బాయ్ చెప్పారు. బ‌హూశ సోమ‌, మంగ‌ళ వారాల్లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని క‌లువ‌నున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే మ‌రింత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలోకి వ‌స్తున్నార‌న్న వ్యాఖ్య‌ల‌ను నిజం చేస్తున్నారు టీడీపీ నేత‌లు. గ‌త కొంత కాలంగా పార్టీ అధిష్టానంపై ఎంపీ గుర్రుగా ఉన్నారు. అమలాపురం టీడీపీ ఎంపీ టికెట్ ఆయనకు ఇచ్చేందుకు అధిష్టానం ఆసక్తి చూపించకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో రవీంద్రబాబు ఎక్కడో ఓ చోట ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీచేయాలని నిర్ణయించారు.

పార్టీకి రాజీనామా చేసిన ఆయన, హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో సమావేశం అయ్యే అవ‌కాశం ఉంది. జ‌గ‌న్‌ను క‌లిసిన వెంట‌నే ఆయన వైసీపీ కండువాను కప్పుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు గడచిన రెండు రోజులుగా ఆయన అమలాపురంలో తన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ మారే విషయంలో చర్చలు సాగించారు.

వరుసగా ఎంపీలు టీడీపీకి రాజీనామా చేస్తుండటం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దీనికి తోడు మరో ఇద్దరు ఎంపీలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తుండటంతో, నేతల ఫిరాయింపులను అడ్డుకునేందుకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం.

ఈనెల 14న వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఎంపీ పి.రవీంద్రబాబు ఖండించిన విషయం తెలిసిందే. తాను టీడీపీని వీడే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. కాని వ్యాఖ్య‌లు చేసిన మూడు రోజులు గ‌డ‌వ‌క ముందే వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డం గ‌మ‌నర్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -