Friday, April 26, 2024
- Advertisement -

చంద్రబాబులో షివరింగ్…….. వైకాపాకు 21 ఎంపి సీట్లు, 45శాతం ఓట్ షేర్ అన్న మరో సర్వే

- Advertisement -

తాను మళ్ళీ గెలవబోతున్నాను, తానే మళ్ళీ గెలవాలి, తాను గెలవకపోతే మీకు దిక్కులేదు అనేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో చంద్రబాబు ఎంతలా మైండ్ గేమ్స్ ఆడాలని చూస్తూ ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారు అన్న నిజాన్ని జాతీయ సర్వేలన్నీ తేల్చిచెప్పేస్తున్నాయి. ఇప్పటికే టైమ్స్ నౌలాంటి ప్రముఖ జాతీయ ఛానల్స్ వైకాపా భారీ విజయం ఖాయమని చెప్పగా, ఇతర సర్వే సంస్థలు కూడా జగన్ విజయం దెబ్బకు టిడిపి వాష్ అవుట్ అవ్వడం ఖాయమని తేల్చేశాయి.

ఈ పరంపరలో ఇప్పుడు తాజాగా మరో సర్వే వచ్చింది. ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ కూడా వైకాపాకు మొత్తం 25ఎంపి స్థానాలతో 20 స్థానాలతో గెలుపు ఖాయం అని చెప్తే ఈ తాజా సర్వే మాత్రం ఏకంగా 21 స్థానాలను వైకాపాకు కట్టబెట్టింది. దాదాపు 45శాతం పైగా ఓటింగ్ షేర్‌తో వైకాపా ఘన విజయం సాధించడం ఖాయం అని తేల్చేసింది. 2019 ఎన్నికల తర్వాత థంపింగ్ మెజారిటీతో జగన్ అధికారంలోకి వస్తాడన్న అంచనాలను మరికాస్త పెంచేసింది ఈ సర్వే. ఇక టిడిపి 37శాతం ఓట్ షేర్‌తో కేవలం 4 ఎంపి సీట్లకే పరిమితమవుతుందని తేల్చేసింది ఈ సర్వే. చంద్రబాబుకు అత్యంత ఘోర పరాభావం ఖాయమని చెప్పేసింది. అలాగే జనసేన పార్టీకి ఐదు శాతం ఓట్ షేర్ ఉందని చెప్పిన ఈ సర్వే ఎంపి సీట్లలో మాత్రం ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదని తేల్చేసింది.

మొత్తంగా చూస్తే ఇప్పటికే ఓటమి భయంతో రకరకాల జిమ్మిక్కులు చేస్తూ, అబద్ధపు ప్రచారాలతో ప్రజల ముందు పలచన అవుతున్న చంద్రబాబులో ఈ సర్వే తర్వాత మరికాస్త భయాందోళన పెరగడం ఖాయం అని స్వయంగా టిడిపి నేతలే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితులు ఎపి రాష్ట్రంలో తలెత్తాయి. సర్వేలు పూర్తిగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ సారి మాత్రం 2014లోలా కాకుండా ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్‌తో పాటు వైకాపా నాయకులు, కార్యకర్తలు కష్టపడుతూ ఉండడం కూడా చంద్రబాబులో ఆందోళన పెంచుతోంది. చంద్రబాబు మార్క్ రాజకీయాలకు, వ్యూహలకు, కుట్రలకు కాలం చెల్లిందన్న విశ్లేషకుల మాటలు 2019 ఎన్నికల ఫలితాలు సాక్ష్యంగా నిలుస్తాయా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -