Friday, April 26, 2024
- Advertisement -

జగన్ మోహన్ రెడ్డిలో నచ్చనది ఇదే..

- Advertisement -

ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి. ఈ సామెత వైఎస్ఆర్ సీపీలో రాజకీయాలకు కరెక్ట్ గా సరిపోతుంది. పార్టీలో మొదట నుంచీ ఉన్న నేతల కంటే తర్వాత వచ్చిన వారికే ప్రాధాన్యం ఎక్కువనే…విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విమర్శలకు తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీలోని పరిణామాలు సాక్ష్యంగా నిలిచాయి. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సమక్షంలో ఐదు రోజుల క్రితం ఎన్నారై రజనీకుమారి వైఎస్ఆర్ సీపీలో చేరింది. ఆమె వైఎస్ఆర్ సీపీకి భారీగా ఫండ్ ఇస్తానని చెప్పడంతో, పాటు తన ఎన్నికల ఖర్చు మొత్తం తానే భరించుకుంటానని జగన్ తో చెప్పినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. తన ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఫండ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, తన ఖర్చు తాను పెట్టుకోవడంతో పాటు, పార్టీకి పెద్దమొత్తంలో ఫండ్ ఇస్తానని రజనీకుమారి చెప్పింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఆమెకు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సీపీ టికెట్ ఇస్తానని భరోసా ఇచ్చేశాడు. అంతేకాదు వెంటనే పార్టీ నియోజకవర్గ సింగిల్ కో ఆర్డినేటర్ గా రజనీకుమారి పేరు ప్రకటించేశారు. దీంతో ఆమె వెంటనే నియోజకవర్గంలో హడావుడి ప్రారంంభించింది.

కేవలం ఐదు రోజుల క్రితం వైఎస్ఆర్ సీపీలో చేరిన రజనీకుమారికి ఊహించని రీతిలో ఏకంగా చిలకలూరిపేట నియోజకవర్గం సింగల్ కో ఆర్డినేటర్ గా నియమించడంతో పాటు ఎమ్మెల్యే టికెట్ హామీ కూడా ఇవ్వడంతో, ఆ నియోజకవర్గం పార్టీ నేతలే కాదు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ నేతలంతా షాక్ తిన్నారు. అసలు ఎవరీ రజనీకుమారి అని ఆరా తీస్తే మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత మంత్రి ప్రతిపాటి పుల్లారావు ద్వారా రజనీకుమారి టీడీపీలో చేరారు. ఎన్నారై అయిన ఆమె ఇంగ్లిష్ తో పాటు తెలుగులో ధారాళంగా మాట్లాడగలదు. పదునైన ప్రసంగాలతో అప్పట్లో చంద్రబాబు దృష్టిని కూడా ఆకర్షించింది. టీడీపీ టికెట్ ఆశించినా చివరి నిముషంలో ఆమెకు అవకాశం చేజారింది. అయితే తనకు టికెట్ రాకుండా చేసింది ప్రత్తిపాటి పుల్లారావేనని గ్రహించిన రజనీ కుమారి తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పేసింది. వైఎస్ఆర్ సీపీలో చేరి 2019 ఎన్నికల్లో ప్రత్తిపాటి పుల్లారావుని ఓడిస్తానని ఆమె శపథం చేసింది. నాడు శపథం చేసినట్లే ఇప్పుడు వైఎస్ఆర్ సీపీలో చేరింది. పార్టీ అధ్యక్షుడు నుంచి టికెట్ కు సంబంధించిన స్పష్టమైన హామీని కూడా తీసుకుంది. చిలకలూరిపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సింగిల్ కో ఆర్డినేటర్ గా నియామకం కూడా జరిగిపోయింది.

ఈ పరిణామాలన్నీ చకచకా క్షణాల్లో జరిగిపోవడంతో మొదట్నించీ చిలకలూరి పేట నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్ సీపీ నాయకుడిగా ఉన్న మర్రి రాజశేఖర్ వర్గం షాక్‌కు గురైంది. పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న తమను, పక్కన పెట్టేసి, నిన్న కాక మొన్న పార్టీలో చేరిన రజనీకుమారిని సింగిల్ కో ఆర్డినేటర్ గా ఎలా నియమిస్తారంటూ మర్రి రాజశేఖర్ సహా ఆయన వర్గీయులు జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి, ఆర్థికంగా బాగా నష్టపోయినా, పార్టీనే నమ్ముకుని ఉన్నందుకు ఇచ్చే బహుమానం ఇదా ? అని మండిపడుతున్నారు. డబ్బు ఉన్నవారికే వైఎస్ఆర్పీలో పదవులు ఇస్తారా ? అని నిలదీస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రాజశేఖర్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకుని, పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకునే జగన్ చేసేది ఇదా ? మండిపడుతున్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా వివిధ పదవుల్లో ఉన్న 400 మంది వైసీఆర్ సీపీపీ నేతలు, జగన్ కు వ్యతిరేకంగా, రాజశేఖర్ కు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేసేశారు. మర్రి రాజశేఖర్ ఎటు వైపు వెళ్తే తామూ అటే నడుస్తామని తేల్చి చెబుతున్నారు. రజనీకుమారి మాత్రం రజాశేఖర్ తో కలసి పని చేసి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీని జెండా ఎగురేస్తామని స్పష్టంగా ధీమా వ్యక్తం చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -