Friday, April 26, 2024
- Advertisement -

చిత్తూరు జిల్లాలో జగన్ కు 70 MM సినిమానే !

- Advertisement -

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ విజయావకాశాలను మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దారుణంగా దెబ్బకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ బాల్ వేసి రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని చెప్పి, విభజన పూర్తయ్యేవరకూ సోనియాకు సహకరించి, తర్వాత చేతులెత్తేసిన కిరణ్ దెబ్బ కొట్టడమేంటి ? అంత సీన్ లేదు. అని తీసి పారేయకండి. ఎందుకంటే కిరణ్ ప్రభావం ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఎంత ఉంటుందో కానీ, ఆయన సొంతప్రాంతం రాయలసీమ, చిత్తూరు జిల్లాపై మాత్రం కచ్చితంగా గట్టి ప్రభావమే ఉంటుంది. 2 లోక్ సభ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ సరిసమంగా ఉన్నాయి. చిత్తూరు ఎంపిగా టీడీపీ అభ్యర్ధి ఉంటే, తిరుపతి ఎంపిగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి కొనసాగుతున్నారు. 14 అసెంబ్లీ స్థానాల్లో 8 వైఎస్ఆర్ సీపీ గెల్చుకుంది. టీడీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. పలమనేరు నుంచి వైఎస్ఆర్ సీపీ తరఫున గెలిచిన అమర్ నాథ్ రెడ్డి ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టారు. దీంతో ఆ జిల్లాలోని 14 స్థానాల్లో టీడీపీకి 7, వైఎస్ఆర్ సీపీకి 7 దక్కాయి.

చిత్తూరు జిల్లాలో

టీడీపీ స్థానాలు
1 తంబళ్లపల్లి
2 తిరుపతి
3 శ్రీకాళహస్తి
4 సత్యవేడు
5 చిత్తూరు
6 కుప్పం
7 పలమనేరు

వైఎస్ఆర్ సీపీ స్థానాలు
1 పీలేరు
2 మదనపల్లి
3 పుంగనూరు
4 చంద్రగిరి
5 నగరి
6 గంగాధర నెల్లూరు
7 పూతలపట్టు

అయితే కిరణ్ కుమారు రెడ్డి తండ్రి దివంగత అమర్నాథ్ రెడ్డి కాలం నుంచీ వారికి జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గట్టి పట్టు ఉంది.

అమర్నాథ్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వాల్మీకిపురం, పీలేరు ప్రాంతం నుంచే గెలుపొందారు.

ప్రస్తుతం జిల్లాలోని దాదాపు 8 నియోజకవర్గాల్లో కిరణ్ కు నమ్మకమైన అనుచరులున్నారు. గుర్రంకొండ, కంభంవారిపల్లె, పీలేరు, కలకడ, వాల్మీకిపురం, కలికిరి మండలాల్లో ఆయన వర్గీయులున్నారు. కిరణ్ గత శుక్రవారం మళ్లీ కాంగ్రెస్ లో చేరిన రోజే యాధృచ్ఛికంగా ఆయన తండ్రి అమర్ నాథ్ రెడ్డి వర్ధంతి. దీంతో ఆ రోజు జిల్లాలోని పలమనేరు, తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లె, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, పీలేరు నియోజకవర్గాల్లో కిరణ్ కుమార్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున అమర్నాథ్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదానాలతో హడావుడి చేశశారు. నాలుగేళ్లు సైలెంటుగా ఉన్న కిరణ్ పోలటిక్సులో రీ ఎంట్రీతో వారిలో నూతనోత్సాహం కనిపించింది. ఇన్నాళ్లూ వీళ్లు అయితే టీడీపీ, లేదంటే వైఎస్ఆర్ సీపీ అని పని చేశారు. ఇప్పుడు టీడీపీ లేదా కాంగ్రెస్ వైపు మళ్లిపోతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో జగన్ కు దెబ్బ తప్పదని తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో సీఎంగా చంద్రబాబు తన ముద్ర వేస్తున్నారు. గట్టి పట్టు సాధిస్తున్నారు. సో ప్రస్తుత సీఎం, మాజీ సీఎం సొంత జిల్లాలో జగన్ కు కష్టాలు తప్పవని, 2 లేదా 3 సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమని విశ్లేషకుల అంచనా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -