శుక్రవారం.. శుక్రవారం.. బాధపెట్టిన టీడీపీకి అదే శుక్రవారం జలక్ ఇచ్చిన జగన్..!

1712
Cm Jagan New Plan on Friday
Cm Jagan New Plan on Friday

శుక్రవారం.. శుక్రవారం అని ఏడిపించే టీడీపీ మీదా జగన్మోహన్ రెడ్డి శుక్రవారమే ప్లానింగ్ చేశారు. ఎప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి లాక్కున్నారో అదే 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో మిగలడం దేవిడి స్క్రిప్ట్ అయితే మిగిత విషయాలను జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తారు. ఎవరైతే తనను అవమానించారో.. వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెనుకడుగు వెయ్యరు. వారికి తగిన శిక్ష పడేలా చేస్తారు.

ఈ మాట మనం చెప్పడం కాదు.. ఈ మాట బయట డిస్కషన్ గా నడుస్తోంది. అయితే రకరకల టార్గెట్లతో ముందుకు వెళ్లే జగన్ ఈ సారి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు. ఏ శుక్రవారం నాడు ఎవరికి రాజకీయ స్పాట్ పెట్టబోతున్నారు అనేది ఇన్‍ట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే విపక్ష నేతగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరుపున పోరాటం చేసేవారో.. ఆయన పాదయాత్ర సమయంలో కూడా సీబీఐ కేసుల కారణంగా ప్రతి శుక్రవారం హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చేది.

అయితే టీడీపీ వాళ్లు శుక్రవారం గురించి గట్టిగానే బాధపెట్టేవారు. శుక్రవారం వస్తే చాలు కోర్టు మెట్లు ఎక్కడం జగన్ కు అలవాటుగా మారిందని.. విమర్శలు గతంలో వినిపించేవి. దీని జగన్ చాలా లైట్ గా తీసుకున్నట్లు కనిపించినా.. ఈ విషయంను ఆయన చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి శుక్రవారం తన ప్రత్యర్దులకు చుక్కలు చూపించే ప్లాన్స్ వేస్తుండటం ఆసక్తిగా మారింది. జగన్ పై సీబీఐ కేసులు ఉన్నాయి. ప్రతి శుక్రవారం నాడు ఆయన సీబీఐ కోర్టుకు వెళ్తూ ఉండేవారు. సీఎం అయ్యాక కూడా కోర్టుకు వెళ్ళడం మనం చూశాం. దీని టీడీపీ తమకు అనుకులంగా మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది.

శూక్రవారం పేరుతో జగన్ ను చిరాకు చేస్తూ వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ అదే శుక్రవారంను తనకు అనుకులంగా మార్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. శుక్రవారమే తెలుగు దేశం వాళ్ళకు జగన్ సమాధనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో శుక్రవారం అంటేనే వైకాపాలో అలజడి రేగేది. కానీ ఇప్పుడు శుక్రవారం వస్తే సంబరాలు మొదలు అవుతున్నాయి. జగన్ టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. అది కూడా శుక్రవారం నాడే చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది యాదృచ్చికంగా జరుగుతుందో లేక.. జగన్ కావాలని చేస్తున్నారో తెలియాల్సి ఉంది.

రీసెంట్ గా శుక్రవారం నాడే మాజీ మంత్రి అచ్చెం నాయుడు ఈఎస్‍ఐ కేసులో ఆరెస్ట్ అయ్యాడు. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం నాడే ఒక హత్య కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. కీలకమైన మూడు రాజధానుల బిల్లును కూడా గవర్నర్ శుక్రవారం నాడే ఆమోదించారు. తనకు యాంటీ సెంటిమెంట్ గా ఉన్న శుక్రవారంను ఇప్పుడు తనకు అనుకులంగా మార్చుకున్నరన్న ప్లాన్లు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. మొత్తానికి శుక్రవారం వస్తుందంటే టీడీపీ గుండెల్లో రైలు పరిగెత్తే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు.

జగన్ కొత్త సూత్రానికి ఫిదా అయిన మోడీ.. ?

చంద్రబాబుకు షాక్ : టీడీపీ కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై..!

వైసీపీలోకి గంటా.. డేట్ కూడా ఫిక్స్.. క్లారిటీ వచ్చేసింది..!

చంద్రబాబు, లోకేశ్ కు షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు.. ?

Loading...