పదవిని మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి : జగన్ పై ముద్రగడ కామెంట్స్

934
Ex Minister Mudragada Padmanabham Write Letter To Ap Cm Ys Jagan
Ex Minister Mudragada Padmanabham Write Letter To Ap Cm Ys Jagan

ఏపీ సీఎం జగన్ కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు ఎందుకు ముందుకు రావడం లేదు. కాపు జాతీ సమస్య తీర్చమని ప్రధాని మోడీని కోరాలన్నారు. నవీన్‌పట్నాయక్‌, జ్యోతిబసు, వైఎస్‌లా పూజలందుకోవాలే గానీ.. మీ పదవిని మూన్నాళ్ల ముచ్చట చేసుకోవద్దని అన్నారు.

ముద్రగడ తన లేఖలో ‘మీరు మీరు అడిగిన వారికి, అడగని వారికి, హామీలు ఇవ్వని, ఇచ్చిన వాటికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారు. మా జాతి చిరకాల కోరిక పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్‌ కోసం చేసిన పోరాటానికి మీ అనుమతితో మీ పార్టీ పూర్తి మద్దత్తు ఇచ్చారు. 1-2-2016 రాత్రి మీడియాకు మీరు ఇంటర్వ్యూ ఇచ్చి మాజాతి కోరిక సమంజసం అని చెప్పారని మిత్రులు చెబితే విన్నాను, అసెంబ్లీలో కూడా మద్దత్తు ఇచ్చారని విన్నాను. ఈ రోజు మా కోరికను దానం చేయడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదండి.

మీ విజయానికి మా జాతి సహాకారం కొన్ని చోట్ల తప్ప మిగిలిన అన్ని చోట్లా మీరు పొందలేదా.. ఎన్నికలు జరిగిన అన్ని రోజుల్లో ఇంచుమించుగా ప్రతి రోజు అప్పటి సీఎం గారు మా జాతిని, ఉద్యమాన్ని, పోలీసులతో చేయించిన దమన కాండ, ఆరాచకాలు, అవమానాలు మీ ఛానెల్‌లో చూపించిందే చూపించి మా జాతి సానుభూతి, ఓట్లు పొందలేదా సీఎం గారు.. పాలకులు ప్రజల యొక్క కష్టాలలో పాలు పంచుకోవాలి. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గారు, అప్పటి బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు గారు, అప్పటి ముఖ్యమంత్రి మీ తండ్రి రాజశేఖర రెడ్డిలా పూజలందుకోవాలే గాని పదవి మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి. సీఎం గాఉ దయచేసి మాజాతి సమస్య తీర్చమని ప్రధాని మోడీ గారిని కోరమని మిమ్మలను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

వైఎస్‌ఆర్‌కి అర్దం ఏంటో చెప్పిన దేవినేని ఉమ..!

సెంటిమెంట్ ను పక్కన పెట్టేసిన జగన్.. కానీ..!

సీఎం జగన్ పై పూరి జగన్నాధ్ ప్రశంసలు..!

కృష్ణ జిల్లాలో ఆ వైసీపీ ఎమ్మెల్యే టాప్ లో ఉన్నాడట..!

Loading...