Friday, April 26, 2024
- Advertisement -

పేద పిల్లల ఇంగ్లీష్ విద్యపై ఇంత రాద్ధాంతమా : శ్రీకాంత్ రెడ్డి

- Advertisement -

కరోనా కల్లోల్లంతో ప్రపంచమంతా అల్లకల్లోల్లంగా ఉంటే రాష్ట్రంలోని తెలుగు దేశంపార్టీ నాయకులు కుల రాజకీయాలు చేయడంపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన రాయచోటి లో మీడియా సమావేశంలో టి డి పి సిగ్గుమాలిన రాజకీయాలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు ప్రణాళికా బద్దంగా చర్యలు చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తోందన్నారు. క్వారంటెయిన్ నుంచి డిశ్చార్జి కాబడిన వ్యక్తికి రూ.2 వేలు ప్రభుత్వము ఇస్తామనడం అభినందనీయమన్నారు.

కానీ ఇవేవీ గిట్టని తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పాలనపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చడవకూడదన్న టి డి పి నేతల కుట్రలు, కుతంత్రాలును చేయడం దారుణమన్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దని విమర్శించే ప్రతి నాయకుడు తమ బిడ్డలను తెలుగుమీడియంలోనే చదివిస్తామని ప్రమాణం చేయాలంటూ ఆయన సవాల్ విసిరారు. అసలుకు రాష్ట్రంలో ని ఎస్ సి , ఎస్ టి , బి సి, మైనారిటీలంటే బాబు కు ఇష్టం లేదన్నారు. మీ పిల్లలు మాత్రం విదేశాలకు వెళ్లి ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలి, బడుగు బలహీన వర్గాల పిల్లలుకు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పడం ఇదేమి న్యాయమంటూ శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు.

జపాన్ వెళ్ళినప్పుడు జపాన్ అభివృద్ధి చెందినదీ కాబట్టి జపాన్ భాషను నేర్చుకోవాలంటాడు ఇక్కడ మాత్రం చంద్రబాబు పేదల పిల్లలు ఇంగ్లీష్ ను వద్దని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫ్యాక్షనిస్టు రాజ్యమంటూ లేఖ రాయడం దేనికి సంకేతమంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే మరో మాజీ ఎం పి కులం జోలికి వస్తే లేపేస్తామంటూ వ్యాఖ్యానాలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోందన్నారు. ప్రస్తుత కరోనా విపత్తు సమయం లో సామాజిక దూరం పాటించాలే కానీ , సామాజిక కులాలను విడదీసే భయంకరమైన వ్యాధికి తెరతీవడం తగదన్నారు.

సి ఎం జగన్ లేపే ధైర్యం ఉంటే రోడ్డు పైకి రావాలని ఆయన సవాల్ విసిరారు.గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తిని ఇలాంటి వ్యక్తుల కారణంగానే పొట్టన పెట్టుకున్నారంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. రాజధాని వికేంద్రీకరణ విషయంలో వ్యతిరేకించడంతో పాటు కీయా కంపెనీ పై లేని పోని వదంతులను సృష్టించింది మీరు కాదా అని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగు మహా సభలును నిర్వహించిందే మహానేత వై ఎస్ ఆర్ అని గుర్తించుకోవాలన్నారు. కుల మతాలతో మాకు పనిలేదని రాష్టంలో 50 శాతం రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాలుకు కల్పించింది సి ఎం జగన్ అని ఆయన తెలిపారు.

మాది కత్తులు పట్టుకుని దోమలు ఎలుకల పై యుద్ధం అంటూ పబ్లిసిటీ చేసుకునే ప్రభుత్వం కాదన్నారు.దోమకు రూ.5 వేలు, ఎలుకకు రూ 10 వేలు చొప్పున కాజేసే ప్రభుత్వం అసలు కాదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించే నిధులను ఇకపై వారి తల్లుల ఖాతాలలో జమ చెయ్యాలని సి ఎం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి పెరిట రూ 3 లక్షల కోట్లు అప్పు చేయడం, 60 వేల కోట్ల రూపాయలు బిల్లులను పెండింగ్ లో పెట్టడమే కాకుండా ఫీజు రీయంర్స్ మెంట్ డబ్బులు చెల్లించక విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారన్నారు.

నాటి విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లింపుల సంబంధించి రూ.2వేల కోట్లను సి ఎం జగన్ చెల్లించిన విషయాన్ని గుర్తెరగాలన్నారు.రేషన్ కార్డ్ లేనివారికి కూడా బియ్యాన్ని ఉచితంగా అందచేయడమే కాక 3 రోజులలో వారికి శాశ్విత కార్డులను అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఎదుర్కొని రెండు అడుగులు ముందుకు వేయడం సి ఎం జగన్ నైజం అని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఉద్గాటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -