Friday, April 26, 2024
- Advertisement -

షాకింగ్ సర్వే………. చంద్రబాబు ఇమేజ్ పాతాళానికి పడిపోయిందా?

- Advertisement -

మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ధీరుడు, ఎపిని నంబర్ ఒన్ చేయగల ఒకే ఒక్కడు అన్న రేంజ్‌లో బాబు ఇమేజ్‌ని జాకీలేసి లేపడానికి స్వయంగా చంద్రబాబుతో సహా టిడిపి నాయకులు, పచ్చ మీడియా సంస్థలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో అబద్ధపు హామీలను పూర్తిగా గాలికొదిలేసి ప్రజలను మోసం చేస్తే ఏం? 2014 ఎన్నికల్లో మోడీ పాజిటివ్ వేవ్‌ని క్యాష్ చేసుకుని, నాలుగున్నరేళ్ళపాటు కేంద్రంలో పదవులు అనుభవించి పూర్తిగా మోడీ పాట పాడి హోదాతో సహా అన్ని విషయాల్లోనూ మోడీ భజన చేస్తూ ఎపిని దగా చేస్తేనేం………..చంద్రబాబు నాయుడు ఒక్కడే నాయకుడు, ఆయనను మించిన వాడు లేడు అని బాబు బ్యాచ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ జనాలను నమ్మించడానికి, అవసరమైతే బాబును ఓడిస్తే మీకు దిక్కూదివాణం ఉండదు అని భయపెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఒక్క శాశ్విత భవన నిర్మాణానికి కూడా పునాదులు కూడా వేయనప్పటికీ అమరావతిని అద్భుతంగా పూర్తి చేసే సత్తా బాబుకే ఉందని నమ్మమని ఊదరగొడుతోంది.

మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు ఇమేజ్ ఎపి ప్రజల దృష్టిలో ఎలా ఉంది అనే విషయాలపై రీసెంట్‌గా స్వయంగా చంద్రబాబే తోక పత్రిక అధినేతతో, సర్వేల స్పెషలిస్ట్ లగడపాటితో ఒక ప్రత్యేక సర్వే చేయించుకున్నారట. ఆ సర్వేలో వచ్చిన ఫలితాలనే రీసెంట్‌గా చంద్రబాబును కలిసి ఇచ్చారని టిడిపి నాయకులు చెప్తున్నారు. చంద్రబాబు ఇమేజ్ పూర్తిగా పాతాళానికి పడిపోయిందని, చంద్రబాబు ఏం చెప్పినా, ఎలాంటి హామీలు ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే ప్రసక్తే లేకుండా పోయిందని ఈ సర్వేలో తేలిందట. ఇప్పుడు ఈ విషయమే బాబుతో సహా పచ్చ బ్యాచ్ జనాలు అందరినీ టెన్షన్ పెడుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, అధికారులు అందరూ వేస్ట్. నేను ఒక్కడినే కష్టపడుతున్నాను. నన్ను చూసి ఓటేయండి అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు అలవాటు. మరి అలాంటి చంద్రబాబుపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందన్న నిజం పచ్చ మీడియా సర్వేలోనే తేలిన నేపథ్యంలో టిడిపి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా టైమ్స్ నౌ సర్వేలో వైకాపాకు 23 ఎంపి సీట్లు వస్తాయని, టిడిపికి కేవలం 2 ఎంపి సీట్లు మాత్రమే వస్తాయని తేలిన నేపథ్యంలో బాబు ఇమేజ్‌పై పచ్చ మీడియా చేసిన సర్వేను కూడా నమ్మాల్సి వస్తోంది అన్నది విశ్లేషకుల మాట. ఏది ఏమైనా 2019 ఎన్నికల్లో టిడిపి చరిత్రలోనే ఎరుగనంత ఘోర పరాజయాన్ని ఎపిలో ఫేస్ చేయబోతోందా అన్న అనుమానాలను స్వయంగా టిడిపి నాయకులే అంతర్గతంగా వ్యక్తం చేస్తండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -