Friday, April 26, 2024
- Advertisement -

కృష్ణ జిల్లాలో ఆ వైసీపీ ఎమ్మెల్యే టాప్ లో ఉన్నాడట..!

- Advertisement -

కృష్ణా జిల్లా ఈ పేరు వింటే మహా మహా నాయకులు గుర్తుకొస్తారు. ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా మంత్రులుగా పనిచేసిన వారు చాలా మంది ఉన్నారు. కృష్ణాజిల్లా అంటే అందరికీ ముఖ్యంగా గుర్తుకు వచ్చేది కమ్మ ప్రాబల్యం. ఈ జిల్లాలో కమ్మ కులంకు చెందినవారు ఎక్కువగా ఉంటారు. ఆస్తులు కూడా ఎక్కువగా ఉండటంతో జిల్లాలో వారిదే ఆధిపత్యం కొనసాగుతూ వచ్చేది. కానీ కాపులు రెడ్లు కూడా ఎప్పటికప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్నారు. ఏపీలో ఎక్కడ ఏ పార్టీ గెలిచిన కూడా జిల్లాలో మాత్రం కమ్మ కులంకు చెందినవారే ఎక్కువగా గెలుస్తూ ఉండేవారు. ఈ కులం మొదటి నుంచి టీడీపీకి అండగా నిలిచారు.

కాపులు రెడ్లు ఒకప్పుడు కాంగ్రెస్కు ఇప్పుడు వైసిపి కి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే 2019 లో జరిగిన ఎన్నికల్లో జిల్లాను పూర్తిగా మార్చివేశారు జగన్. ఈ ఎన్నికల్లో 16 నియోజకవర్గాలకు గాను 14 నియోజకవర్గాలు గెలిచికుని.. తమ పార్టీ సత్తా నిరూపించారు వైసీపీ నాయకులు. కేవలం గన్నవరం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాల్లో మాత్రమే టిడిపి విజయం సాధించింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్కు మద్దతుగా నిలిచారు. ఇక మిగిలిన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా వైసీపీలో చేరుతున్నారని అనేక వార్తలు వచ్చినప్పటికీ ఆయన ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చే ఇటీవలే ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో జిల్లాలో పెద్దగా రాజకీయపరంగా అనూహ్య సంఘటనలు ఏం చోటుచేసుకోలేదు. కానీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనే దాని గురించి జిల్లా ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నాయకులు అందరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలుస్తోంది. అయితే జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా అందరికంటే ముందు నిలిచారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. మాజీ మంత్రి దేవినేని ఉమ వంటి నాయకుడిపై పన్నెండు వేల కోట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు ఆయన. వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే అయిన దగ్గర్నుంచి నియోజకవర్గంలోనే ఉంటున్నారు. తన వ్యాపారాలను సైతం పక్కనపెట్టి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు. కరోనా సమయంలో ప్రతి గ్రామానికి కూరగాయలను పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు.

గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఇసుక, మట్టి వంటీ దందాలను అరికట్టడంలో ఆయన విజయం సాధించారు. తప్పు చేసి ఇరుకుంటే తన సొంత వారికి సైతం రికమెండ్ చేయని తత్వం ఆయనది. తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నెలలో ఒక్కసారైన పర్యటిస్తూ ప్రజల సమస్యలను తీర్చడంలో ఆయన ముందున్నారు. ఈ విధంగా నిత్యం ప్రజల్లో తిరుగుతూ జిల్లాలో పట్టు పెంచుకునే పనిలో పడ్డారు వసంత. ఆయన ఇలాగే ప్రజలకు సేవచేస్తే వచ్చే ఎన్నికల నాటికి దేవినేని ఉమ మరో నియోజకవర్గం వెతుకోవాల్సిందే అని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ విధంగా జిల్లాలో హేమహేమిలు ఉన్నప్పటికి కూడా అందరికంటే ముందు వరసలో నిలిచారు వసంత కృష్ణ ప్రసాద్.

సంక్షోభ సమయంలోనూ సంక్షేమానికి పెద్దపీట

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాపాక వరప్రసాద్

మహిళా ఉద్యోగినిపై దాడి చేసిన సహ ఉద్యోగి..!

ఏపీ సీఎం జగన్ చూసి మేము నేర్చుకోవాలి : ఆమ్రపాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -