Saturday, April 27, 2024
- Advertisement -

రోజా ఎమ్మెల్యే కావడానికి కారణం.. జబర్ధస్త్.. ?

- Advertisement -

రోజా.. మొదట సినిమా పరంగా బాగా ఫాపులర్. సినిమా హీరోయిన్ అయిన రోజా.. స్టార్ హీరోల సరసన నటించింది. కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా నటించింది. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రోజా.. వైసీపీలో ఉంది. అయితే రోజా ఎక్కడ ఉంటే అక్కడ అంతే సంగతులు అనే రూమర్స్ ఉన్నాయి. ఎందుకంటే.. రోజా ఎక్కడ ఉంటే.. ఆ పార్టీ అధికారంలోకి రాదు అనే రూమర్స్ ఉన్నాయి. ఇదే విషయంపై రోజా చాలా సార్లు చాలా మంది మీద ఫైర్ అయ్యింది. వైసీపీ లో ఉంది కాబట్టి.. వైసీపీకి అధికారం దక్కడం లేదని రోజాని అంటూ ఉంటారు.

రోజా పరిస్థితి వైసీపీలో ఇలా ఉంది. కానీ రోజా మాత్రం వైసీపీని వదిలి వెళ్లేది లేదని.. వచ్చే ఎన్నికల్లో తమదే అదికారం అని ప్రతి మీటింగ్ లో చెప్పుతునే ఉంది. అయితే రాజకీయ పరంగా రోజా పరిస్థితి ఎలా ఉన్నప్పటికి.. బుల్లితెరపై మాత్రం రోజా పరిస్థితి బాగుంది. ఎందుకంటే.. రాజకీయాల్లో రోజా ఎక్కడ ఉంటే అక్కడ అధికారం దక్కడం కష్టమే అన్నప్పటికి.. బుల్లితెరపై మాత్రం రోజా ఎక్కడ ఉంటే ఆ షో పక్కా హిట్ అనే ఫార్ములా ఉంది. రోజా బుల్లితెరపై ఇప్పటికే కొన్ని షోలు చేసింది. అవన్ని పర్వాలేదు. ఇక జబర్ధస్త్ షో లో మాత్రం ఎవరు ఏంత ప్రధాన్యత ఉన్నప్పటికి.. రోజా కి ఉన్న ప్రధాన్యత వేరు. ఆమె షోలో లేకుంటే.. ఆ రోజు షో చూడాలి అనిపించదు. అంతలా జనాల్ని కనెక్ట్ అయ్యింది రోజా. అయితే ఇటివలే జబర్ధస్త్ టీం అంత.. దసరా కానుకగా ఓ ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించి ఓ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు.

ఈ ప్రోమో లో నాగబాబు.. సుధీర్ పై పైర్ కావడం.. రోజా.. నేను ఎమ్మెల్యే కావడానికి కారణం జబర్ధస్త్ అని చెప్పడం.. చివర్లో అనసూయ కళ్ళు తిరిగి పడిపోవడం లాంటివి ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా రోజా ఏడుస్తూ.. ఎమ్మెల్యే కావడానికి కారణం.. జబర్ధస్త్ అనడంపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. వై ఎస్ జగన్ రోజాకి సీట్ ఇచ్చి.. ఎమ్మెల్యే చేస్తే.. జగన్ ను మర్చిపోయి… జబర్ధస్త్ కారణం అని చెప్పడం తప్పు అని వైసీపీ నాయకులు రోజా పై ఫైర్ అవుతున్నారు. మరి రోజా ఎందుకు ఆ మాట అన్నదో తెలియాలంటే.. పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -