Friday, April 26, 2024
- Advertisement -

చిన‌బాబు పోటీ చేస్తున్నా రోచ్‌….

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడి రాజ‌కీయ వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు నారా లోకేష్‌. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో కాకుండా ఎమ్మెల్సీ ద్వారా మంత్రిప‌దవిలో కొన‌సాగుతున్నారు. బాబు వార‌సుడిగా చెప్పుకోత‌గ్గ ల‌క్ష‌ణాలు లోకేష్‌లో లేవ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం అయ్యింది. దొడ్డిదారిన మంత్రి అయ్యారంటూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శల‌కు చెక్ పెట్టార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో జరిగే ఎన్నిక‌ల్లో లోకేష్ పోటీ చేస్తున్నార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 175 నియోజ‌క వ‌ర్గాల్లో లోకేష్ కోసం సేఫ్ సీటును బాబు ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

గ‌తంలో కుప్పంనుంచి లేకుంటే ఉత్తరాంధ్ర‌నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం సాగింది. తాజాగా లోకేశ్ అమరావతి ప్రాంతం నుంచే బరిలో దిగనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోనే ఉన్న పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీకి కంచు కోట. ఇక్క‌డ నుంచి పోటీ చేస్తే లోకేష్ గెలుపున‌కు ఢోకా ఉండ‌ద‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు.

ప్రస్తుతం పెదకూరపాడు ఎమ్మెల్యేగా టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. కొమ్మాలపాటి శ్రీధర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి లోకేష్ ను బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అభివృద్ధి చెందుతున్న అమరావతి ప్రాంతం నుంచి కాకుండా అభివృద్ధికి దూరంగా ప్రాంతం నుంచి లోకేశ్ పోటీ చేస్తే బాగుంటుందని మరికొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరి సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -