Friday, April 26, 2024
- Advertisement -

సీటు కోసం సొంత ఇంట్లో కుంపటి…. బాలయ్య, లోకేష్ మధ్య యుద్ధం… బాబు చాణక్యం

- Advertisement -

జగన్ దృష్టంతా ఎప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ మీదే…..అధికారం కోసమే జగన్ రాజకీయం అని చెప్పి ఆరోపించని టిడిపి నాయకుడు ఎవ్వరూ లేరేమో. కానీ చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులందరూ కూడా అధికారం కోసం, పదవుల కోసం పరస్పరం తిట్టుకుంటూ ఉంటారు. సొంతమామకు వెన్నుపోటు పొడిచిన బాబు స్ఫూర్తితోనే రీసెంట్‌గా చనిపోయిన గాలి ముద్దుకృష్ణమనాయుడి పదవి కోసం ఆయన ఇద్దరు కొడుకుల మధ్య యుద్ధమే నడిచింది. ఇక ఎమ్మెల్యే సీట్ల కోసం టిడిపిలో ఇప్పటికే సిగపట్లు మొదలయ్యాయి. బాబు పంచాయితీలను, హెచ్చరికలను లెక్కచేయకుండా బహిరంగంగా యుద్ధానికి తలపడుతున్నారు పచ్చ నాయకులు.

బయటి వాళ్ళ పదవీ దాహంతోనే తలపట్టుక్కూర్చున్న చంద్రబాబుకు ఇప్పుడు ఇంట్లోనే యుధ్దం మొదలయ్యింది. డైరెక్ట్‌గా ప్రజాక్షేత్రంలోకి దిగితే ఓడిపోవడం ఖాయం అని తను చేయించుకున్న సర్వేలలో తేలడంతో లోకేష్‌ని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చాడు చంద్రబాబు. ఇక 2019 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా లోకేష్‌ని ప్రజా క్షేత్రంలోకి దింపాల్సిందే. సాక్షాత్తూ చంద్రబాబునాయుడే రాజ్యసభ నుంచి ప్రధాని అయిన మన్మోహన్‌ని దొడ్డిదారిన పదవి దక్కించుకున్నాడని ఎన్నోసార్లు పరుషంగా మాట్లాడాడు, అవమానించాడు, హేళన చేశాడు. ఇప్పుడు చినబాబు లోకేష్‌ని దొడ్డిదారి మంత్రి అనే అంటున్నారు. అందుకే ఎలా అయినా లోకేష్‌ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నాడు చంద్రబాబు. అయితే రాష్ట్రం మొత్తం మీద చినబాబు గెలిచే అవకాశాలు కాస్తో కూస్తో ఉన్న నియోజకవర్గంగా హిందూపురం ఒక్కటే ఉందట. అందుకే లోకేష్ కోసం బాలయ్యను త్యాగం చేయమని అడిగారట. అయితే హిందూపురం నా తండ్రి వారసత్వం అన్న బాలయ్య అక్కడినుంచే పోటీ చేస్తానని గట్టిగా చెప్పాడట. అసలే బాలయ్య మొండి మనిషి. అఫ్కోర్స్…..అలాంటి బాలయ్యను కూడా ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్‌లో బకరాను చేసి వాడుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందనుకోండి. ఇప్పుడు కూడా మరి లోకేష్‌-బాలయ్యల సీటు సిగపట్ల సమస్యను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -