Friday, April 26, 2024
- Advertisement -

పక్కనే మహిళ ఉండగా అలాంటి వ్యాఖ్యలా ?

- Advertisement -

సినిమాల్లో చేసీ చేసీ పవన్ కళ్యాణ్ కు సినిమా డైలాగులు బాగా అబ్బేసినట్టుున్నాయి. నిజ జీవితంలోనూ వేలాదిమంది ప్రజల మధ్యలోనూ వీధి రౌడీల భాషలో తల తీస్తాం, కాళ్లు విరగ్గొడతాం, కీళ్లు విరిచేస్తాం. ఆకు రౌడీలను, గాలి రౌడీలను తరిమేశాను. అగ్ని గుండం సృష్టిస్తా, కత్తి పడతా, అంటూ ఊగిపోతూ చెప్పిన డైలాగులే భయంకరం అనుకుంటే, అంత కంటే దారుణమైన డైలాగులు చెప్పాడు. ఎవరో ఎవరితోనో పడుకుంటే నాకేంటి ? మీరు మీరూ పడుకుంటే నేనేం చేయాలి ? అంటూ ఓ మహిళనుద్దేశించి ఎగతాళిగా నవ్వుతూ మాట్లాడాడు. ఓ పార్టీ నాయుకుడిగా, సీనియర్ నటుడిగా తనకు న్యాయం చేస్తారని, తనకు జరిగిన అన్యాయంపై స్పందిస్తారని, తనను మోసం చేసిన వారిని ప్రశ్నిస్తారని ఇతడినుద్దేశించి కొన్ని రోజుర క్రితం సదరు మహిళ మాట్లాడింది. అవకాశాల పేరుతో తనను అన్నివిధాలా వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అవకాశాల కోసం నిస్సహాయ స్థితిలో, తాను కొందరి చేతిలో మోసపోయానని ఆమె లబోదిబోమంది. పవన్ కళ్యాణ్ వంటి బలమైన నాయుకుడు తన సమస్యపై స్పందిస్తే, ప్రశ్నిస్తే ముందు ముందు తనలాంటి వాళ్లను మోసం చేయాలంటే భయపడతారని, తనకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశించింది. ఓ మహిళగా సిగ్గువిడిచి మరీ నాలుగ్గోడలు మధ్య, జరిగిన చీకటి మోసాన్ని బట్టబయలు చేసి, తనలాగా మరింత మంది మోసపోకుండా చూడాలని వేడుకుంది. అయినా పవన్ సార్ స్పందించకపోవడంతో ఆమె ఆక్రోషంతో తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలే చేసింది.

కానీ ఆమెనుద్దేశించి ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణాతి దారుణం. ఆమె ఏ స్థితిలో అలా పడుకోవాల్సి వచ్చిందో..? అలాంటి వాళ్లు ఎంతమంది అలా నలిగిపోతున్నారో ? ఎంత మంది అవకాశాల పేరుతో మోసం చేస్తున్నారో ? ఎంత మంది మహిళలు ఇలా బయట పడలేక లోలోపలే కుమిలిపోతున్నారో..? తననుద్దేశించి కూడా తీవ్రపదజాలం వాడిందంటే, తన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి కూడా అలా మాట్లాడిదంటే.. ఏం పరిస్థితుల్లో ఉందో..అని పవన్ ఆలోచించలేకపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. తాను పడుకున్నాను అని ఆమె చెబితేనే కదా పవన్ కి ఆ విషయం తెలిసింది. తాను ఏ పరిస్థితుల్లో పడుకోవాల్సి వచ్చిందో, ఎలా ఎంత మంది చేతిలో మోసపోయిందో ? చెప్పుకుని కన్నీటిపర్యంతమైంది. తనలాంటి అభాగ్యులకు న్యాయం చేస్తారనో, ఆదుకుంటారనో ఆమె నోరు విడిచి సాయం అడిగితే… దానిపై ఇన్నాళ్ల తర్వాత పవన్ ఎగతాళి చేయడం ఏమాత్రం బాగోలేదు. పైగా ఎవరో ఎవరితోనో పడుకుంటే నేనేం చేయాలి ? మీరూ మీరూ పడుకుంటే నేనేం చేయగలను అంటూ తను హేళనగా, కామెడీ చేస్తూ ఈ డైలాగులు చెబుతున్నప్పుడు, అదే వేదిక మీద, తన పక్కనే ఓ మహిళ ఉందనే స్పృహ కూడా పవన్ కు లేదా అన్నది చాలామంది మహిళలు వేస్తున్న ప్రశ్న. పవన్ వెంట అలాంటి డైలాగులు విన్న ఆమెకు ఒక్క క్షణం ఏం అర్ధం కాలేదు. తర్వాత ఇబ్బంది పడుతూ నవ్వలేక, ఏడ్వలేక హావాభావాలు పెట్టింది. ఓ మహిల పట్ల తోటి మహిళ పక్కన, సభలో అనేకమంది మహిళలు ఉండగా ఎవరితో ఎవరితోనే పడుకుంటే నేనేం చేసేది ? మీరూ మీరూ పడుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ? అంటూ చెప్పడం పవన్ సంస్కారానికి నిదర్శనం అని మహిళాలోకం ట్రోల్స్ చేస్తోంది. చింతమేనేని ప్రభాకర్ ను తల తీస్తాం, కాళ్లు విరగ్గొడతాం, అని ఓ పార్టీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడటమే తప్పంటే, ఓ మహిళ గురించి ఇలా మాట్లాడటం మరో తప్పు అని మండిపడుతున్నాయి రాజకీయ వర్గాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -