Friday, April 26, 2024
- Advertisement -

ప్ర‌ధాని మోదీ …

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడికి కేంద్రంలో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.ఇన్నాల్లు ఎప్పుడు ప‌డితే అప్పుడు మోదీతో భేటీ అయ్యే సీఎంకు ఆయ‌న అపాయంట్‌మెంటే క‌రువ‌య్యింది.బాబుకి కేంద్రంలో అన్నీ తాపై వ్య‌వ‌హ‌రించిన కేంద్ర‌మంత్రికూడా ఏమి చేయ‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

ఏడాదిగా చంద్రబాబుకు నో… తనను కలవడానికి ఏడాది కాలంగా మోడీ చంద్రబాబుకు అవకాశం ఇవ్వడం లేదని అంటున్నారు. అయితే, చంద్రబాబు ప్రత్యర్థులకు మాత్రం మోడీతో భేటీకి అవకాశం లభిస్తోంది. ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు అనేది ప్రధాని ఇష్టమే అయినప్పటికీ చంద్రబాబుకు అసంతృప్తి కలిగించే ఆ భేటీలకు మోడీ సిద్ధపడడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. లక్ష్మీపార్వతి తాజాగా మోడీతో భేటీ కావడం చంద్రబాబుకు షాక్ ఇచ్చే విషయమే.

చంద్రబాబును ఏకాంతంగా కలవడానికి మోడీ ఇష్టపడడం లేదని అంటున్నారు. ముఖాముఖి భేటీకి చంద్రబాబు ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నా మోదీ ద‌ర్శ‌నం మాత్రం క‌రువ‌య్యింది.ఇటీవల గుజరాత్‌లో జరిగిన టెక్స్ టైల్స్ షోకు మోడి వస్తున్నారని తెలియగానే చంద్రబాబు వెళ్ళారు. అయితే, మోడీ చంద్రబాబును కలవడానికి ఇష్టపడలేదని అంటున్నారు.

చంద్రబాబు అమెరికా వెళ్లడానికి ముందు ప్రధాని మోడీని కలవడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లభించలేదని సమాచారం. అయితే, చంద్రబాబు అమెరికాలో ఉండగానే మోడీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో దాదాపు గంట పాటు ముచ్చటించారు.ఇది బాబుకు మింగుడు ప‌డ‌ని అంశం.

ఢిల్లీలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. చంద్రబాబుకు ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పనిచేస్తున్నట్లుగా వైయస్ జగన్‌కు విజయసాయి రెడ్డి చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. మోడీ మనసును జగన్‌‌కు అనుకూలంగా మార్చడంలో విజయసాయియ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.ఢిల్లీ పెద్ద‌లు మాత్రం ఏదైనా అడుగు కాని ..మోదీతో భేటీ.. ఆ ఒక్క‌టీ అడ‌క్కు అంటున్నారంటి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -