Friday, April 26, 2024
- Advertisement -

బాబు ఢిల్లీ డ్రామా టైంలోనే ప.గో.లో టిడిపి ఎమ్మెల్యేను బహిష్కరించిన ప్రజలు

- Advertisement -

ఒక వైపు ఢిల్లీలో డ్రామాను చంద్రబాబుగారు అత్యద్భుత నటనతో రక్తికట్టిస్తున్న సమయంలోనే 2014ఎన్నికల్లో టిడిపి క్లీన్ స్వీప్ జిల్లాలో టిడిపికి ఘోర పరాభవం ఎదురైంది. ఏకంగా టిడిపి ఎమ్మెల్యేను ప్రజలు బహిష్కరించారు. వెంటనే వెళ్ళిపోవాలని ఆదేశించారు. పోలీసు బలగంతో హల్చల్ చేయాలని ఎమ్మెల్యే చూసినప్పటికీ గ్రామస్తులందరూ కూడా ఏకమవడంతో మరో ప్రత్యామ్నాయం లేక సమస్యలు నాకు చెప్పండి…….నేను పరిష్కరిస్తాను అని ఎమ్మెల్యే ఒక మెట్టదిగి ప్రజలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రజలు మాత్రం ఐదేళ్ళుగా ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తాం అని చెప్పి డ్రామాలు ఆడుతుంటే మేం మరోసారి నమ్మిమోసపోవాలా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో ఆ ఎమ్మెల్యే బిత్తరపోవాల్సి వచ్చింది.

ఒక సారి ప్రజల మధ్యకు వెళితే టిడిపిపైన ప్రజల్లో ఏ స్థాయి కోపం ఉందో చంద్రబాబుకు అర్థమవుతుందని ఎప్పటి నుంచో రాజకీయవేత్తలు చెప్తూ ఉన్నదే. అయితే ఐదేళ్ళుగా ప్రజల మొహం చూడని టిడిపి నాయకులు ఇప్పుడు ఎన్నికల కోసం ప్రజల దగ్గరకు ప్రేమగా వెళ్తూ ఉంటే పరిస్థితులు స్పష్టంగా అర్థమవుతున్నాయి. పరిటాల సునీతలాంటి మందీ మార్బలం ఉండే ఎమ్మెల్యే కూడా మహిళల నుంచి తీవ్రస్థాయిలో నిరసన ఎదుర్కోవలసి రావడాన్ని చూశాం. ఇప్పుడు టిడిపికి క్లీన్ స్వీప్ విక్టరీ ఇచ్చిన గోదావరి జిల్లాలో టిడిపిని ఊరి ప్రజలు ఊర్లో నుంచి తిరిమేసేంత కోపంతో విరుచుకుపడడం సంచలనం అవుతోంది. పశ్ఛిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలంలోని సరిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఎన్నికల స్టంట్ కోసం టిడిపి ఎమ్మెల్యే మాధవనాయుడు వెళ్ళారు. అభివృద్ధి జపం చేస్తే ప్రజలంతా బ్రహ్మరథం పడతారని చంద్రబాబు రేంజ్‌లో ఏవో గొప్ప మాటలు చెప్పడానికి ప్రయత్నం చేశాడు.

అయితే ప్రజలు మాత్రం తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించారు. పోలీసుల సాయంతో కార్యక్రమం చేద్దామనుకున్నప్పటికీ ప్రజలు మరీ భారీగా నిరసన వ్యక్తం చేస్తూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండడంతో ఎమ్మెల్యే కూడా తగ్గాల్సి వచ్చింది. సమస్యలేంటో చెప్పాలని ఎమ్మెల్యే అడిగినప్పటికీ ప్రజలు మాత్రం ఈ ఎన్నికల డ్రామాలు మా దగ్గర వద్దు అంటూ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో ఎలాగోలా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు ఆ టిడిపి ఎమ్మెల్యే మాధవనాయుడు. ఇప్పుడు ఈ ఘటనే ఎపి రాజకీయాల్లో సంచలనం అవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంపై ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుందో తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -