అసెంబ్లీ సమావేశాల వేళా చంద్రబాబు కి బిగ్ షాక్ ఇవ్వనున్న జగన్..?

432
tdp ex leaders about tdp party
tdp ex leaders about tdp party

టీడీపీ పార్టీ గతంలో ఎప్పుడూలేని డిఫెన్సివ్ సిచువేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.. చంద్రబాబు మానసిక పరిస్థితి ఎలా ఉందొ తెలీదు కానీ వచ్చే ఎన్నికలనాటికి అయన ఓల్డ్ ఏజ్ తో మానసిక పరిస్థితి కూడా కొంత ఆందోళన కరంగా ఉంటుందన్నది మాత్రం అందరు గ్రహిస్తున్న విషయం.. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తన పార్టీ లోకి వచ్చే నేతలను కాదనకుండానే రాజీనామా పద్ధతిని ముందర పెడుతున్నారు.. అయితే ఆ వచ్చే నేతలు రాజీనామాకు పెద్దగా ఇష్టపడకపోయినా తమ కుటుంబ సభ్యులను చేర్చి చాలా సాగె గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు..

ఈ క్రమంలోనే త‌న‌కు అవ‌స‌రం లేకున్నా టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల‌ను త‌న చెంత‌కు చేర్చుకున్నారు. అయితే గతంలో చంద్రబాబు చేసిన విధంగా కాకుండా ప్రజలు గమనిస్తున్నారన్న అంశం పరిగణలోకి తీసుకుని ఎంతో పారదర్శకంగా అయన ఆ నేతలను తన పార్టీ లో చేర్చుకున్న విధానం చూసి ప్రజలు కొత్త తరహా రాజకీయం చేస్తున్న జగన్ ను పొగడకుండా ఉండలేకపోతున్నారు.. ఇక ఇప్పుడు మ‌రో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ఓ ఇద్దరు నేతలు వైసీపీ లోకి రావడానికి ఎంతో ఉవ్విళ్లూరుతున్నారని తెలుస్తుంది.

ఈ చేరికలు టీడీపీ ని, చంద్రబాబు ను చాలా ఢీలా పరుస్తాయి.. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల చేరికలతో సగం కృంగిపోయిన చంద్రబాబు ను ఈ ఇద్దరి చేరికలతో మరింత క్రుంగ తీయొచ్చు.. కానీ వీరి చేరిక స్వయంగా వద్దని అంటున్నారట.. అందుకు కారణం వ‌ర్షాకాల స‌మావేశాల‌ను నిర్వహించేందుకు దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలూ రెడీ అవుతున్నాయి. ఆ కారణంగానే వీరిని ఇప్పటికిప్పుడు పార్టీలోకి తీసుకునేందుకు జ‌గ‌న్ సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు ముందుగా వీరిని చేర్చుకుని టీడీపీ కోలుకోలేని దెబ్బ తీయాలని జ‌గ‌న్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి జ‌గ‌న్ ఈ విష‌యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Loading...