చంద్రబాబు, లోకేశ్ కు షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు.. ?

1737
TDP MLCs Are Not Interested in Resigns
TDP MLCs Are Not Interested in Resigns

ఏపీలో రాజకీయాలు ఏటు వెళ్తున్నాయో అనేది సరిగ్గా చెప్పలేని పరిస్థితి అని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అమరావతిని రాజధానిగా ఉండనివ్వలని టీడీపీ ప్రయత్నించినప్పటికి.. అది కుదరలేదు. జగన్ సర్కార్ తాము అనుకున్నట్లే మూడు రాజధానులకు ఓకే అయిపోయింది.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి టీడీపీ ఎమ్మెల్సీలకు ఫోన్ వెళ్తే అస్సలు స్పందన లేదని పార్టీలో గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాదాపుగా 95శాతం టీడీపీ ఎమ్మెల్సీల ఫోన్ లు వాళ్ళ పీఏల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయట. ఇటీవలే అమరావతి రాజధాని తరలింపును నిరసిస్తూ చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల రాజీనామాలకు మొగ్గుచూపిన విషయం తెలిసిందే. దాంతో కావాలంటే మీరు రాజీనామా చేయండని.. మేము మాత్రం చేయమని స్విచ్ఛ్ ఆఫ్ పెట్టుకున్నారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మూడు రాజధానుల సెంటిమెంట్ టీడీపీకి ఏ మాత్రం లేదని.. ఇప్పుడు అంతా ప్రజలు కరోనా వల్ల ఆర్థికంగా కుదలైన పరిస్థితి గురించే ఆలోచిస్తున్నారని.. అందుకే రాజీనామాలతో లాభం లేదని టీడీపీ ఎమ్మెల్సీలు రాజీనామాకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. రాజకీయంగా గ్రామాల్లో చప్పగా ఉందని.. ఈ టైంలో రాజీనామాలు చేసేది లేదని లోకేష్ కు ఎమ్మెల్సీలంతా తెగేసి చెప్పారని టీడీపీ వర్గాల్లో ఒక టాక్ విపరితంగా నడుస్తోంది.

బాలయ్య, పవన్ చేస్తే తప్పు లేదు.. నేను చేస్తే తప్పా ? : ఎమ్మెల్యే…

టీడీపీకి అమరావతి.. వైసీపీకి విశాఖ.. మరి జనసేనకు ?

గాజువాకలో చిత్తుగా ఓడిపోయాడని.. వైజాగ్ పై పవన్ కి కసి : రోజా

టీడీపీ వేర్లు కూడా పీకేసిన జగన్.. సరికొత్త చరిత్రను లిఖించాడు..!

Loading...