తెలంగాణా లో ఆ పార్టీ అసలు ఉందా లేదా..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నికల్లో ఓడిపోయాం అన్న చింత కొంత కూడా లేకపోగా మళ్ళీ ప్రజల్లో నమ్మకం పెంచుకుందామన్న భావన అస్సలు వారి లో కనపడట్లేదు.. ఇప్పటికే చాల సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని, ప్రజలను గాలికి వదిలేసింది టీడీపీ. ప్రజలవద్దకు వెళ్ళడానికి వారికి ఎందుకు ఇష్టం ఉండట్లేదు తెలీదు కానీ ప్రజల్లో మాత్రం వారు రోజు రోజు కి దిగజారిపోతున్నారు.. దానికి తోడు టీడీపీ పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది.. ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా దాడి చేస్తుందో తెలియని పరిస్థితి.. ఇప్పటికే టీడీపీ నేతలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు..

వైసీపీ ఆపరేషన్ అవినీతి లో ఇప్పటికే పలువురి టీడీపీ నేతలను జైలు కి పంపింది. దాంతో  ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమను జైలుకి పంపిస్తారన్న భయం టీడీపీ నేతల్లో నెలకొంది.. ఓ వైపు చంద్రబాబు మొత్తుకున్నా నేతలు మాత్రం బయటకి వచ్చే సాహసం చేయలేకపోతున్నారు.. ఆంధ్రాలో ఇలాంటి పరిస్థితి ఉంటే తెలంగాణ లో టీడీపీ పరిస్థితి అట్టడుగుకు చేరిపోయింది. ఇప్పటికే హైదరబాద్ ని అకాల వర్షాలు ముంచెత్తాయి. ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేని స్థాయిలో వర్షం పడటంతో నగరాన్ని వరద నీరు చుట్టుముట్టింది.

- Advertisement -

వర్షాలు తగ్గినా వరద పరిస్థితి ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం మాత్రం కనపడటం లేదు.  ఆర్ధిక సహాయం సంగతి తర్వాత, మా సమస్యను మీరు వినండి ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళండి సార్ అంటూ చాలా మంది నాయకులను ప్రజలు వేడుకునే పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ మహా నగరంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలే బలహీనంగా ఉన్న టీడీపీ ముందడుగు వేస్తే మంచిది.. కానీ టీడీపీ కొంచెం కూడా కదలకపోవడం ఆశ్చర్యంగా ఉంది..  రాష్ట్ర అధ్యక్షుడు గాని, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్ లు గాని, అసెంబ్లీ ఇంచార్జ్ లు గాని ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. పార్టీకి నాయకత్వం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఉన్న కొద్దీ మంది నాయకులు కూడా ప్రజల్లోకి రాకపోతే ఎలా అని పార్టీ మీద అభిమానం, మమకారం ఉన్న కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయస్థానం విషయంలో చంద్రబాబు కి అంత అవసరమా..

గట్టిగానే చెమటోడుస్తున్న హరీష్ రావు..

చంద్రబాబు కు తమ్ముళ్ళను కలిసే టైం లేదా..

బీజీపీ బ్రెయిన్ ఉంటే ఆ పని చేయదు..?

Most Popular

35 ఏళ్ళ వయసులో అనసూయ ఎలా రెచ్చిపోయిందో చూడండి..!

ప్రదీప్, శ్రీముఖి లకు పెళ్లి జరగడం ఏంటి.. ఆ వేడుకలో అనసూయ డ్యాన్స్ చేయడం ఏంటని కంగారు పడకండి. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు మన అనసూయనే. విషయంలోకి...

పూజిత పొన్నాడ కు అన్ని ఉన్న ఆఫర్స్ రావడం లేదు.. ఎందుకు ?

దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన “రంగస్థలం” అనే చిత్రంలో ముఖ్యపాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది పుజిత పొన్నాడ. అయితే ఈ బ్యూటీ ముందుగా “హరి ప్రసాద్” దర్శకత్వం వహించిన...

ఏపీ పోలీసు శాఖకు 103 అవార్డులు

ఏడాది కాలంలో ఏపీ పోలీసు శాఖకు 103 అవార్డులు రావడం సంతోషంగా ఉందని, దేశంలోనే ఏపీ పోలీసుల మెరుగైన సేవలకు అవార్డులే నిదర్శనమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు....

Related Articles

సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలుపెట్టాడని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌...

చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులోని రామ్మూర్తి...

పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణం

కాసుల కక్కుర్తి కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తాకట్టుపెట్టారని, పోలవరం ప్రాజెక్టును పాత లెక్కలకు ఒప్పుకుంది చంద్రబాబేనని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు దోపిడీ వల్ల...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...