విశాఖ నుంచే పరిపాలన.. జగన్ ఫిక్స్..!

738
Vizag to become the executive capital
Vizag to become the executive capital

మూడు రాజధానుల విషయంలో ఎలాంటి మార్పు లేకుండా ముందుకెళ్లాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వచ్చే అక్టోబర్ నాటికి సచివాలయాన్ని అమరావతి నుంచి తరలించడం ఖాయమని అని సమాచారం.

దసరా నుంచి విశాఖ నుంచే పరిపాలన కొనసాగించేలా జగన్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులపై వెనెక్కి వెళ్లే ప్రసక్తి లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా గవర్నర్ ప్రసంగంలోనూ జగన్ వినిపించారు. వచ్చే అక్టోబర్ నాటికి తరలింపు ఖాయమని తెలుస్తోంది. అసెంబ్లీలోనూ దీన్ని చర్చించారు. అక్టోబర్ 25 విజయదశమి పండుగ కల్లా సచివాలయం సీఎం కార్యాలయాన్ని విశాఖకు మార్చడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడని అధికార వర్గాలు తెలిపాయి.

భీమిలిలోని మూతబడిన ఓ ఇంజినీరింగ్ కాలేజీని తాత్కాలిక సచివాలయంగా మార్చవచ్చని తెలుస్తోంది. మాజీ సీఎం రోశయ్య అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్ కు చెందిన పైడా ఇంజినీరింగ్ కాలేజీ రెండేళ్ల నుంచి మూతపడింది. దీన్నే సచివాలయంగా మారుస్తారని సమాచారం.

దేశం కోసం అండగా ఉంటాం.. ప్రధానితో సీఎం జగన్..!

వేదాద్రి రోడ్డు ప్రమాదంలో మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా : సీఎం జగన్‌

ఏపీ నుంచి కొత్త రాజ్యసభ సభ్యులు వీరే..!

ఏపీ బడ్జెట్‌ ప్రధాన అంశాలు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే ?

Loading...