Friday, April 26, 2024
- Advertisement -

సెంటిమెంట్ లేదు.. కేసీఆర్ కు యాంటిమెంటే?

- Advertisement -

తొలిసారి అధికారంలోకి వచ్చాక టీడీపీని.. రెండోసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ను ఖతం చేయాలని చూస్తున్న కేసీఆర్ కు ఇప్పుడు మరో వ్యతిరేకత వచ్చి పడింది. అదే ప్రజా, ఉద్యోగుల వ్యతిరేకత.. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో కొరివితో తల గోక్కుంటున్న కేసీఆర్.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యతిరేకంగా మారితే కష్టమేనంటున్నారు.

కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కఠినంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ అంతటా సాగుతోంది. అందుకే ఆరు నెలలకే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలను ఓడించి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను గెలిపించారు. ఈ ఎంపీ ఎన్నికలకు కేసీఆర్ విలన్ గా తెలంగాణ సమాజంలో చూపించిన చంద్రబాబు కూడా దూరంగా ఉండడం బీజేపీ, కాంగ్రెస్ బలపడడానికి కలిసి వచ్చింది.

అయితే ఎప్పుడూ చంద్రబాబు, ఆంధ్రా బూచీ చూపి తప్పించుకుంటున్న కేసీఆర్ కు ఇప్పుడు తెలంగాణలో సమ్మెలో చంద్రబాబు వేలు పెట్టడం లేదు. అయితే జనసేనాని పవన్ మాత్రం స్పందించారు. వాళ్లిద్దరూ ఉద్యమానికి దూరంగా ఉండడం కేసీఆర్ కు మైనస్ గా మారింది. వాళ్లిద్దరూ దిగితే ఆంధ్రా శక్తులతో ఉద్యమాలా అన్న ప్రచారాన్ని కూడా గులాబీ టీం చేసి ఉండేది. కానీ ఆ అవసరం చంద్రబాబు, పవన్ ఇవ్వకపోవడం గమనార్హం.

కేసీఆర్ ప్రస్తుతం కేవలం రైతుల కోణంలోనే పాలిస్తున్నారు. కానీ పరిస్థితి ఇప్పుడు మిగతా వర్గాలను దూరం చేసేలా కనిపిస్తోంది. దాదాపు అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మారింది. దీన్ని గ్రహించి కేసీఆర్ చర్యలు తీసుకోకపోతే గులాబీ పార్టీని, కేసీఆర్ ను ప్రజలు దూరం పెట్టడం ఖాయమన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -