Saturday, April 27, 2024
- Advertisement -

అచ్చెన్నా కి అంత దమ్ముందా.. దిగజారిపోయిన పార్టీ ని…?

- Advertisement -

తెలుగు దేశం పార్టీ కి కొత్త ప్రెసిడెంట్ వస్తున్నాడని టీడీపీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో అచ్చెన్నా పై చాలామంది నేతలు తమ అభ్యంతరం తెలుపుతున్నారు. అచ్చెన్న గత ట్రాక్ రికార్డు అంతగా బాలేకపోవడం, జైలుకి వెళ్లి వచ్చి అవినీతి ఆరోపణలు ఉన్నవాడు కావడం వంటివి ప్రజల్లో నాటుకుపోవడంతో అధ్యక్షుడిగా అచ్చెన్నా వస్తే పార్టీ కి నష్టం అనే భావన కలుగుతుంది..కానీ మరోవైపు అచ్చెన్నారావడం కొత్త ఉత్సాహం రేపుతోంది అని అంటున్నారు..

వాస్తవానికి గత కొన్ని రోజులుగా పార్టీ వర్గాల్లో అంతా నీరసం, నిరుత్సాహం. పిలుపిస్తే కదలటం సంగతి తర్వాత .. అసలు పిలుపులే లేవు. అంతా ప్రెస్ మీట్లు.. మీడియాలో హడావుడి తప్ప.. గ్రౌండ్ లో హడావుడి లేదు. కిమిడి కళా వెంకట్రావు అధ్యక్షుడిగా ఉన్నా.. ఆయన ప్రెస్ నోట్లు రిలీజ్ చేయటమే.. కనీసం మీడియాకు మొహం కూడా చూపించడం లేదు. అలాంటి టీడీపీకి ఇప్పుడు కొత్త ఉత్సాహం వస్తుందేమో అనే ఆశలు కలుగుతున్నాయి.

ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అచ్చెన్నాయుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొన్నటిదాకా ప్రచారమే అనుకున్నా.. ఇప్పుడు కన్ ఫామ్ అయిపోయింది.అసెంబ్లీలో జగన్ మాట్లాడుతున్నప్పుడల్లా.. ఆయనపై ఉన్న కేసుల గురించి, జైలు గురించి ఎత్తేది ముందు అచ్చెన్నాయుడే. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చాక.. కక్ష గట్టినట్లే వ్యవహారం నడుస్తోంది. అసెంబ్లీలో సైతం అచ్చెన్నాయుడిని టార్గెట్ చేసి చాలాసార్లు సస్పెండ్ చేశారు. ఒకసారి సెషన్స్ మొత్తానికి కూడా సస్పెండ్ చేశారు. 23 మంది ఎమ్మెల్యేలున్నా సరే.. 50 మంది ఉన్నట్లుగా హడావుడి చేయగలిగారంటే అది అచ్చెన్నాయుడు వల్లే. అచ్చెన్నాయుడు సభలో లేని రోజు.. అధికార పార్టీపై గర్జన చేసేవాళ్లు ఎవరూ మిగలలేదు. ఈనేపథ్యంలో అచ్చెన్నా వస్తే నష్టం కన్నా లాభం కలిగేది ఎక్కువ అని అంటున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -