Friday, April 26, 2024
- Advertisement -

ఓటుకు కోట్లుకు భయపడి పారిపోయిన బాబుకు జగన్‌ ధైర్యం గురించి మాట్లాడే అర్హత ఉందా?

- Advertisement -

కేవలం ఒక సినిమా ఎక్స్‌ట్రా షోస్ కోసం కేసీఆర్ ఇంటి దగ్గర పడిగాపులు కాచి, కేసీఆర్‌ని వేనోళ్ళ పొగిడిన పవన్ కళ్యాణ్‌కి జగన్‌ ఆత్మగౌరవం గురించి ఏం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్‌తో సహా దేశంలో ఉన్న చిన్నా పెద్ద నాయకులందరి దగ్గరకూ స్వయంగా వెళ్ళి వాళ్ళకు శాలువాలు కప్పి మద్దతివ్వమని బ్రతిమాలుకునే చంద్రబాబుకు జగన్ ఆత్మాభిమానం గురించి ఏం తెలుస్తుంది? హరికృష్ణ మృతదేహం దగ్గర టీఆర్‌ఎస్‌తో పొత్తు గురించి కేటీఆర్‌తో చర్చించిన చరిత్ర బాబుది. పరామర్శకు వచ్చిన కేటీఆర్‌ని పొత్తుకు ఒప్పించాలని బ్రతిమాలుకున్నప్పటికీ కేసీఆర్ మాత్రం చంద్రబాబు నైజం తెలిసినవాడు కనుక ఛీ కొట్టాడు. అదే కేటీఆర్ స్వయంగా తానే వైఎస్ జగన్ ఇంటికి వచ్చి జగన్‌కి మద్దతిచ్చాడు. జగన్ సపోర్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మద్దతిస్తానని చెప్పాడు. అదీ జగన్ రేంజ్. కానీ చంద్రబాబుతో మాత్రం పవన్ కళ్యాణ్ నుంచీ కేటీఆర్‌తో సహా దేశంలో ఉన్న అందరు నాయకుల దగ్గరకూ ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాయకుడు వెళ్ళి అడుక్కోవడమే తప్ప వాళ్ళంతట వాళ్ళుగా వచ్చి ఈయనను కలిసిన నాయకుడు మాత్రం ఎవరూ కనిపించరు.

పదవుల విషయంలో కూడా జగన్‌కి ఉన్న చిత్తశుద్ధి, విలువలు పవన్, బాబులకు ఉన్నాయా? ప్యాకేజ్‌లకు అమ్ముడుపోయి చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి తెలిసికూడా వాళ్ళ ప్రాపకం కోసం జగన్‌పై విమర్శలు చేస్తున్న పవన్ ఎక్కడ? పచ్చ మీడియా సపోర్ట్ కోసం పచ్చ బ్యాచ్ దగ్గర సాగిలపడ్డ పవన్ ఎక్కడ? సొంతంగా పార్టీ స్థాపించి పొత్తులతో సహా ఎలాంటి, ఎవ్వరి సపోర్ట్ లేకుండా కేవలం ప్రజలనే నమ్ముకుని, విలువలు, విశ్వసనీయతతో కూడా నిజాయితీ రాజకీయాలు చేస్తున్న జగన్ ఎక్కడ? సోనియా దగ్గర సాగిలపడి ఉంటే జగన్‌పై కేసులు ఉండేవా? సోనియా నుంచీ బయటికి వచ్చిన వెంటనే ప్రెస్‌మీట్‌లో జగన్ మాట్లాడిన మొదటి మాటల్లోనే తనపై కేసులు పెట్టొచ్చు, ఇబ్బందిపెట్టొచ్చు అని చెప్పాడు. అంటే అన్నీ తెలిసి కూడా ఆత్మాభిమానం చంపుకోవడం కంటే కష్టాలు ఎదుర్కోవడమే కరెక్ట్ అని భావించాడు. ఇక 2014 ఎన్నికల్లో ఎంతమంది చెప్పినప్పటికీ చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇవ్వలేదు. ఎందుకంటే జగన్ లక్ష్యం ముఖ్యమంత్రి పదవి కాదు. ముఖ్యమంత్రి అయ్యి జనాల గుండెల్లో నిలిచిపోయేలా పాలించాలన్నది అసలు లక్ష్యం. అందుకే ప్రజలను మోసం చేసి కాదు………నిజాయితీగా ప్రజల అభిమానం సంపాదించి గెలవాలనుకుంటున్నాడు.

అలాంటి జగన్ వ్యక్తిత్వం ముందు చంద్రబాబు, పవన్‌లు నిలబడగలరా? పదవి కోసం ఎవ్వరి కాళ్ళు పట్టుకోవడానికి అయినా, సొంత మామనే వెన్నుపోటు పొడవడం లాంటి హత్యా రాజకీయాలకు కూడా వెనుకాడని చంద్రబాబుకు జగన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా? పచ్చ మీడియాకు, చంద్రబాబు అండ్ బ్యాచ్ బెదిరింపులకు భయపడిపోతూ, వాళ్ళిచ్చే ప్యాకేజ్‌లకు అమ్ముడుపోతూ తూతూ మంత్రం రాజకీయాలు చేస్తున్న పవన్‌కి అసలు జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? పదేళ్ళుగా ప్రతి రోజూ ప్రజల ముందే ఉన్న జగన్ ఏనాడైనా ప్రేమాభిమానాలు తప్ప ఆవేశం చూపించాడా? ప్రజలకు జరుగుతున్న అన్యాయం చూసి ఆవేదన వ్యక్తం చేయడం తప్ప ఎప్పుడైనా రెచ్చగొట్టేలా మాట్లాడాడా? అదే ఇప్పుడు పవన్, చంద్రబాబులను చూడండి……..ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో? తెలంగాణాలో ఉన్న సీమాంధ్రులకు ప్రాబ్లం అవుతుంది అన్న కామన్ సెన్స్ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేలా మాట్లాడుతున్నారు. నాలుగున్నరేళ్ళపాటు కేసీఆర్ ప్రాపకం కోసం పాకులాడిన వీళ్ళు ఇప్పుడు ఆంధ్రుల ఆత్మాభిమానం అంటూ కేసీఆర్‌పై రెచ్చిపోతున్నారు.

ఎన్నికలు వారం రోజుల్లోనే ఉన్న నేపథ్యంలో ఆఖరి మూడునెలల రాజకీయం, పథకాలు కాకుండా ఐదేళ్ళుగా చంద్రబాబు, పవన్, జగన్‌లు చేసిన రాజకీయ కార్యకలాపాలు, మీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు చూసి సరైన నిర్ణయం తీసుకోండి. ఐదేళ్ళుగా అనుక్షణం అబద్ధాలు, మాట మార్చడాలు చేసిన నాయకులకు దిమ్మతిరిగేలా, బుద్ధి వచ్చేలా తీర్పు చెప్పండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -