Friday, April 26, 2024
- Advertisement -

వణుకుడు మొదలైంది……. మరోసారి బాబు కుట్రకు దిమ్మతిరిగే కౌంటర్‌తో కెసీఆర్ రెడీ

- Advertisement -

తాజాగా కెసీఆర్ రచిస్తున్న ఒక స్కెచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి జీవితానికి ముగింపు పలకబోతోందా? అది కూడా అత్యంత విషాద పరిస్థితుల మధ్య చంద్రబాబు రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడబోతోందా? పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే అలానే జరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ మధ్య చంద్రబాబు కోసం వెల్-కమ్ గ్రూప్ అంటూ కెసీఆర్‌తో మధ్యవర్తిత్వం నడిపి ఇద్దరు చంద్రుల మధ్యా సయోధ్య కుదిర్చాడు రాధాకృష్ణ. అయితే చంద్రబాబు మాత్రం కెసీఆర్‌తో సఖ్యంగానే ఉన్నట్టు నటిస్తూ 2019లో కెసీఆర్‌నే దెబ్బకొట్టడానికి రెడీ అయ్యాడు. రేవంత్ రెడ్డితో సహా టిడిపి నాయకులను కాంగ్రెస్‌లోకి పంపిస్తూ కాంగ్రెస్ బలోపేతమవుతోందన్న ప్రచారానికి తెరవెనుక సాయం చేస్తూ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కెసీఆర్‌ని పదవి నుంచి దించాలన్న వ్యూహం పన్నాడు బాబు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణాలో కూడా అధికారంలోకి రావాలన్న దుగ్థతో ఆ మధ్య వందల కోట్ల రూపాయలతో కెసీఆర్ ప్రభుత్వాన్ని కబళించాలని కుట్రపన్ని కెసీఆర్ చేతిలో అడ్డంగా తానే బుక్కయిన వైనంలానే ఇప్పుడు కూడా చంద్రబాబే ఇరుక్కున్నాడు. కాంగ్రెస్‌తో కలిసి బాబు ఆడుతున్న డ్రామాలు తెలుసుకున్న చంద్రబాబు రైట్ టైంలో ఊహించని విధంగా బాబును దెబ్బకొట్టడానికి రెడీ అయ్యాడు. తెలంగాణా డిజిపి, ఎసిపి డిజి, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఎకె ఖాన్, మరికొందరు న్యాయనిపుణులతో ఓటుకు కోట్లు కేసుపై సమీక్ష నిర్వహించాడు కెసీఆర్. 2019లో తననే దెబ్బకొట్టాలని చంద్రబాబు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కెసీఆర్ తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాకూడా చంద్రబాబును అరెస్ట్ చేసే స్థాయి కేసు ఇదని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారట. అలాగే ఆడియో, వీడియో సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యం, ఆడియోలో ఉన్న బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ తేల్చిన నేపథ్యంలో కేసు విచారణకు కూడా ఎక్కువ టైం పట్టదని……..వీలైనంత త్వరగానే ఓటుకు కోట్లు కొనుగోలు వ్యవహారంలో ఉన్న చంద్రబాబు, రేవంత్‌రెడ్డి లాంటి వాళ్ళందరికీ శిక్షలు పడేలా చెయ్యొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. కెసీఆర్‌కి ఇప్పుడు కావాల్సింది కూడా ఇదే. కాంగ్రెస్‌లో చేరిపోయి తనకు చికాకు పుట్టిస్తున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తో లోపాయికారిగా కుమ్మక్కయి తనను దెబ్బకొట్టాలని చూస్తున్న చంద్రబాబులను సిసలైన దెబ్బ కొట్టడానికి రెడీ అవుతున్నాడు చంద్రబాబు. అదే జరిగితే మాత్రం చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయినట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పట్టిసీమతో సహా ఇతర అక్రమాల్లో అయితే బిజెపి ప్రతీకారం తీర్చుకుంటోందని ప్రచారం చెయ్యొచ్చు. కానీ ఆడియో, వీడియో సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు ప్రజల నుంచి సానుభూతి వచ్చే అవకాశం కూడా అస్సలు లేదు. కెసీఆర్‌ని తెరవెనుక మేనేజ్ చేసుకోవడం తప్ప చంద్రబాబుకి ఈ విషయంలో వేరే ఆప్షన్ లేదు. ఏం చేస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -