Friday, April 26, 2024
- Advertisement -

జగన్ ప్రమాణ స్వీకారానికి బాబు దూరం.. కారణమిదే

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ ఉదయం జగన్ తిరుమల వెంకన్నను దర్శించుకొని కడప వెళ్తున్నారు. అక్కడ దర్గాకు వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఇలా మూడు మతాల ఆచారాలను పూర్తి చేశాక సాయంత్రం విజయవాడకు వస్తున్నారు.

కాగా ఈ సాయంత్రం కేసీఆర్ కూడా విజయవాడకు వస్తున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందే కేసీఆర్ వస్తుండడంతో రాజకీయంగా సంచలనంగా మారింది. జగన్, కేసీఆర్ లు కలిసి విజయోత్సవాలతో పాటు ప్రమాణ స్వీకారంపై ప్రసంగాలపై చర్చించారు. ప్రసంగం వేళ ఖచ్చితంగా కేసీఆర్ నోటి నుంచి రిటర్న్ గిఫ్ట్ ప్రస్తావనే వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలుంటాయి. ఇంది చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితే.. అందుకే వారి విజయోత్సవాల్లో టీడీపీ భాగస్వామ్యం కాకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

టీడీపీ అధినేత చంద్రబాబును కాబోయే ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు. అయితే చంద్రబాబు దీనిపై నిన్న టీడీపీ పార్టీ నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

జగన్ కు కూడా 2014లో చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి రమ్మంటే హాజరు కాలేదు. ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి రమ్మని మంత్రులను హైదరాబాద్ లోటస్ పాండ్ పంపినా వారిని లోపలికి కూడా రానీయలేదు. ఈ రెండు కార్యక్రమాలకు జగన్ దూరంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు వెళ్లడం మంచిదికాదన్న అభిప్రాయం టీడీపీ నేతల నుంచి వ్యక్తమైందట.. పైగా ప్రత్యర్థులు జగన్, కేసీఆర్ ఒకేవేదికపై ఉండబోతున్నారని.. వారి వ్యాఖ్యలతో అనవసరంగా అభాసుపాలు కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -