హీరో యష్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు..!

910
Hero Yash With His Wife Radhika Pandit
Hero Yash With His Wife Radhika Pandit

2018 డిసెంబర్ 21న ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ రిలీజ్ అయ్యి ఎంత్ పెద్ద సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమా ఇదే అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ మూవీలో హీరో యష్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించిన తీరుకి అందరూ ఫిదా అయిపోయారు.

దాంతో ఒక్కసారిగా యష్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 23 న విడుదల కాబోతుంది అని ఆనౌన్స్ చేసారు. టీజర్ లు కాకుండా డైరెక్ట్ గా ట్రైలర్ నే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే కరోనా వైరస్ కారణంగా మొత్తం లాక్ డౌన్ అయింది. అందుకే కె.జి.ఎఫ్ చాప్టర్2 షూటింగ్ వాయిదా పడింది. దాంతో రిలీజ్ డేట్ మారవొచ్చు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ లాక్ డౌన్ కారణంగా గ్యాప్ దొరికింది కాబట్టి.. హీరో యష్ ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

భార్య రాధికా పండిట్ అలాగే పిల్లలను ముద్దులతో ముంచెత్తుతున్నాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యష్, రాధికలు 2016లో బ్ర‌హ్మీస్‌-గౌడ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకోగా, డిసెంబ‌ర్ 2,2018న వారికి పండంటి బిడ్డ పుట్టింది. రాధిక‌, య‌శ్‌లు టీవీ సీరియ‌ల్స్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయ‌గా, 2008లో ‘మూగిన మనసు’ సినిమాతో తొలిసారి వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ మరో నాలుగు సినిమాలు చేశారు. అప్పుడే యష్, రాధిక మధ్య ప్రేమ చిగురించడంతో 2016లో కుటుంబ సభ్యులను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

Loading...