Saturday, April 27, 2024
- Advertisement -

కరోనా రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

- Advertisement -

కరోనా వైరస్ అనే పేరు వినబడితేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి చాలా మంది చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. దీని గురించి ముఖ్య విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేషియా, నేపాల్, సింగపూర్, , తైవాన్, దక్షిణ కొరియా, థాయ్ లాండ్, వియత్నాం దేశాల్లో వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో కూడా కరోనా కేసులు పేరుగుతున్నాయి.

నేడు వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. లాటిన్‌లో కరోనా అంటే కిరీటం అని అర్థం. అయితే.. ఈ వైరస్‌ని మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకారంలోనే ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. ఈ వ్యాధి సోకితే.. ముందుగా జలుబు ఉంటుంది. ఆ తర్వాత జ్వరం, దగ్గు, తలనొప్పి, ఛాతిలో నొప్పి.. వీటితో పాటు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతోంది. నలత, గొంతునొప్పి, చలిజ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటన్నింటిని త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోకపోతే మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే ప్రతీ ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : తెలియాని వారికి దూరంగా ఉండటం ప్రధానమైనది. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి.. తెలియని వారిని ముట్టుకోవడం, తాకడం లాంటివి చేయొద్దు. కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు. చాలా మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి, నలుగురిలోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం బేటర్. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి. జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. కరోనా వైరస్ ఉన్నట్లుగా ఏదైనా అనుమానంగా అనిపిస్తే ముందుగా వైద్యులను సంప్రదించాలి. వారిచ్చే సలహాలు, సూచనలు పాటించొచ్చు. ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగుతుండాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -