Friday, April 26, 2024
- Advertisement -

ముగ్గ‌రిచేతిలో టీమిండియా కోచ్ ఎంపిక‌…

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ స‌మీఫైన‌ల్లో టీమిండియా ఓడిపోవడంతో దాని ప్ర‌భావం కోచ్‌పై ప్ర‌భావం ప‌డింది. కొత్త కోచ్ వేట‌లో ప‌డింది బీసీసీఐ. చీఫ్ కోచ్‌తో పాటు సహాయక బృందం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మూడు నిబంధనలతో నోటిఫికేషన్ విడుదల చేసిన బీసీసీఐ ఆఖరి గడువును ఈనెల 30 వరకు నిర్దేశించింది. కొత్త కోచ్ ను నిర్ణ‌యించే అధికారం సీవోయే క‌పిల్ త్ర‌యానికి అప్న‌గించిన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహాదారుల కమిటీ(సీఏసీ) కొనసాగించాలా వద్దా అన్న దానిపై ఎలా ముందుకు వెళ్లాలో సూచించాలంటూ సుప్రీంను సీవోఏ కోరనుం ది. ఈ నేపథ్యం లో సీఏసీ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాని పక్షంలో కపిల్‌దేవ్ సారథ్యంలోని అడ్‌హాక్ కమి టీ కొత్త కోచ్‌ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

గతంలో సీఏసీ సభ్యులుగా నియమితులైన మేటి క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, సౌరభ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో… వారి స్థానంలో కపిల్‌ త్రయాన్ని తాత్కాలిక (అడహక్‌) ప్రాతిపదికపై నియమించారు. ఈ బృందమే డిసెంబరులో మహిళా జాతీయ జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసింది. అయితే ఎంపిక‌పై సీవోయేలో బేదాభిప్రాయాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు కూడా టీమిండియా కోచ్ ఎంపిక విష‌యంలో సీవోఏ సభ్యుల్లో తిరిగి విభేదాలు తలెత్తే అవకాశముంది. రామన్ ఎంపిక ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తిరిగి అలా జరుగకుండా జాగ్రత్తలు పాటించే సూచనలు కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -