Friday, April 26, 2024
- Advertisement -

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి బీసీసీఐ బంపరాఫర్… వార్షిక వేతనం ఎంతో తెలుసా…?

- Advertisement -

ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచకప్ లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో హెడ్ కోచ్ రవిశాస్త్రిపై తవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన తన కోచ్ పదవికి రాజీనామా చేయాలని అన్ని వర్గాలనుంచి విమర్శలు వచ్చాయి. అంతే కాదు కోచ్ పదవిపై వేటు పడుతుందని అందరూ భావించారు కాని మరో సారి టీమిండియా హెడ్ కోచ్ గా రవినే ఎంపికయ్యారు.

రెండో సార కోచ్ గా ఎంపికైన రవిశాస్త్రికి బీసీసీఐ భారీ ఆఫర్ చేసింది. దీంతో రవిశాస్త్రికి కొత్త కాంట్రాక్టులో భారీ వేతనం ముట్టనుందని క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల రెండో పర్యాయం హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. 2021లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వరకూ పదవిలో ఉండనున్నాడు.ఈ నేపథ్యంలో.. అతని జీతాన్ని బీసీసీఐ మరో 20 శాతం పెంచినట్లు వార్తలు వస్తున్నాయి.

రవిశాస్త్రి‌కి ప్రస్తుతం ఏడాదికి రూ. 9.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. తాజాగా 20 శాతం పెంచడంతో గతంలో కంటే అతని జీతం దాదాపు రూ. 1.5 కోట్ల మేర పెరిగినట్లు ఆ సంస్థ పేర్కొంది. మొత్తం 12 కోట్లదాకా వార్షిక వేతనం అందుకోనున్నారు.

రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల వార్షిక వేతనం కూడా భారీ పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -