Saturday, April 27, 2024
- Advertisement -

ఇది ఇంగ్లండ్‌కు తీర‌ని అవ‌మానం…

- Advertisement -

విశ్వ‌విజేత ఇంగ్లండ్‌కు టెస్ట్ మ్యాచ్‌లో ప‌సికూన ఐర్లాండ్ గ‌ట్టి షాక్ ఇచ్చింది. టెస్టులో మొద‌టి ఇన్నీంగ్స్‌లో ఇంగ్లండ్ ను 85 ప‌రుగుల‌కే కుప్ప‌కూల్చింది. ఐర్లాండ్ బౌల‌ర్ల ధాటికి ముగ్గురు బ్యాట్స్ మెన్‌లు డ‌కౌట్ అయ్యారు. లిరోజు బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ జట్టును ఐర్లాండ్‌ పేసర్‌ టిమ్‌ ముర్తా(5/13) గడగడలాడించాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్‌వాన్ స్పందించారు. 85 ప‌రుగుల‌కే ఆలౌట్ అవ్వ‌డం జ‌ట్టుకు తీవ్ర అవ‌మాన‌మ‌న్నారు.

పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తున్నా కొన్ని బంతులు మంచిగా పడ్డాయని చెప్పాడు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు చెత్త షాట్లు కూడా ఆడారని తెలిపాడు. ‘నిజం చెప్పాలంటే ఇది అవమానకరం. క్రికెట్‌ పుట్టిన గడ్డపై టెస్టు మ్యాచ్‌లో అది కూడా పసికూన లాంటి ఐర్లాండ్‌ చేతిలో 85 పరుగులకే ఆలౌట్ అవ్వ‌డం చూస్తె ఇంత‌క‌న్నా అవ‌మాన‌క‌రం ఉండ‌ద‌న్నారు. ఇంగ్లాండ్‌ ఇదివరకు 1997లో ఆస్ట్రేలియా చేతిలో 77 పరుగులకే ఆలౌటైంది. 22 ఏళ్ల తర్వాత మళ్లీ తక్కువ స్కోరుకు ఆలౌటవ్వడం ఇదే తొలిసారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -