Saturday, April 27, 2024
- Advertisement -

గంగూలీ, ధోనీ కెప్టెన్సీలో తేడా చెప్పిన గ్రేమ్ స్మిత్..!

- Advertisement -

గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీల కెఫ్టెన్సీలపై ఇటీవలే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదా కష్టపడితే.. ధోనీకి ప్రతిఫలాలు అందాయని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. క్లిష్ట పరిస్థితిలో జట్టులోకి వచ్చిన గంగూలీ.. మేటీ ఆటగాళ్లతో జట్టును తయారు చేసి ధోనీకి అందించాడని తెలిపాడు. అయితే ధోనీ, దాదా కెఫ్టెన్సీ పై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరి కెప్టెన్సీలో ఉన్న తేడా మహేంద్ర సింగ్ ధోనీనే అని తెలిపాడు.

మహీ లాంటి ఫినిషర్ గంగూలీ జట్టులో ఉంటే మరింత సక్సెస్ సాధించేవాడని తెలిపాడు. “దాదా, మహీ కెప్టెన్సీలో ఉన్న అతిపెద్ద తేడా ధోనీనే. అతను మంచి ఫినిషర్. ఎలాంటి పరిస్థితుల్లోనైన జట్టును గెలిపించే ఆటగాడు ఉంటే విజయాలు వాటంతటే అవే వచ్చి చేరుతాయి. నా వరకు వాళ్ల కెప్టెన్సీలో ఉన్న తేడా అదే. ఒక వేళ గంగూలీ జట్టులో ధోనీ వంటి బ్యాట్స్ మెన్ ఉండి ఉంటే అతను మరింత సక్సెస్ సాధించేవాడు. మరిన్నీ ట్రోఫీలు అందుకునేవాడు. ఆసీస్ అధిపత్యం ఉన్న రోజుల్లో దాదా జట్టును నడిపించాడు.

ఆ టైంలో ఆసీస్ ప్రపంచ క్రికెట్ ను శాసించింది. ధోనీ లాంటి ఫినిషర్ ఉంటే దాదా ఆసీస్ ను ఆడ్డుకునేవాడు. నా దృష్టిలో ఓపెనింగ్ వదులుకోవడం, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం సవాల్‌తో కూడుకున్నదే. టెస్ట్ క్రికెట్ లో ధోనీ కంటే గంగూలీనే గ్రేట్. ఇక వన్డేల్లో మాత్రం నా చాయిస్ ధోనీనే” అని స్మిత్ స్పష్టం చేశాడు. ఇక 311 వన్డేలు ఆడిన గంగూలీ 10773 రన్స్ చేయగా.. ధోనీ 350 మ్యాచ్‌ల్లో 10773 పరుగులు చేశాడు. ఇక టెస్ట్‌ల్లో దాదా 7212 రన్స్ చేయగా.. ధోనీ 4876 పరుగులు చేశాడు.

సర్వేలో గంగూలీని ఓడించిన ధోనీ.. ఎంత తేడాతో అంటే ?

ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్ జడేజా.. చివర్లో కోహ్లీ..!

రిటైర్మెంట్‌ మ్యాచ్‌లో ధోనీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు : గంగూలీ

ధోనీకి ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -