Friday, March 29, 2024
- Advertisement -

సర్వేలో గంగూలీని ఓడించిన ధోనీ.. ఎంత తేడాతో అంటే ?

- Advertisement -

టీమిండియాకు సౌరవ్ గంగూలీ దూకుడు నేర్పాడు. అలానే భారత్‌కి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఇద్దరిలో ప్రభావంతమైన కెఫ్టెన్ ఎవరు ? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పడం చాలా కష్టం. అందుకే స్టార్‌ స్పోర్ట్స్ ఓ సర్వే నిర్వహించింది.

టెస్టుల్లో ఇద్దరి కెఫ్టెన్సీ స్వదేశీ, విదేశీ రికార్డులు.. వన్డేల్లో బద్దలు కొట్టిన రికార్డులు.. కెఫ్టెన్ గా ఉన్నప్పుడు చేసిన పరుగులు, టీం పై కెఫ్టెన్సీ ప్రభావం.. వంటి అంశలు పరిగణలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించింది. ఇందులో గంగూలీపై 0.4 తేడాతో ధోనీ విజయం సాధించాడు. భారత్ గడ్డపై 21 టెస్టులకి కెప్టెన్సీ వహించిన గంగూలీ 47.6 శాతం విజయాల్ని అందుకోగా.. ధోనీ 30 టెస్టుల్లో 70 శాతం గెలుపు రికార్డ్‌‌ని సొంతం చేసుకున్నాడు. ఇక విదేశాల్లో 29 టెస్టులకిగానూ గంగూలీ 39 శాతం, 30 టెస్టుల్లో కేవలం 20 శాతం మాత్రమే గెలుపు రికార్డ్‌ని ధోనీ నమోదు చేశారు.

వన్డేల్లో మొత్తంగా 146 మ్యాచ్‌లకి కెప్టెన్సీ వహించిన గంగూలీ 76 మ్యాచ్‌ల్లో టీమ్‌ని గెలిపించాడు. ధోనీ 200 మ్యాచ్‌లకిగానూ 110 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందించాడు. కెఫ్టెన్ గా ఉన్నప్పుడు బ్యాట్స్ మెన్ గానూ గంగూలీపై ధోనీదే పైచేయిగా కనిపిస్తోంది. గంగూలీ 49 టెస్టుల్లో 37.66 సగటుతో 2,561 పరుగులు చేయగా.. ధోనీ 60 టెస్టుల్లో 40.66 సగటుతో 3,454 పరుగులు చేశాడు. అలానే 142 వన్డేల్లో గంగూలీ 38.79 సగటుతో 5,082 పరుగులు చేయగా.. ధోనీ 172 వన్డేల్లో 53.55 సగటుతో 6,641 పరుగులు చేశాడు. మొత్తంగా.. కొద్ది తేడాతో గంగూలీపై ధోనీ పైచేయి సాధించాడు.

ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్ జడేజా.. చివర్లో కోహ్లీ..!

రిటైర్మెంట్‌ మ్యాచ్‌లో ధోనీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు : గంగూలీ

ధోనీకి ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదట..!

అక్తర్ బౌలింగ్‌కి సచిన్ భయపడ్డాడు.. నేను చూశా : అఫ్రిది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -