Friday, April 26, 2024
- Advertisement -

కోహ్లీలేని టీమిండియా ..డివిలియర్స్ లేని సౌతాఫ్రికా ఒక్క‌టే..

- Advertisement -

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరికొంతకాలం క్రికెట్ ఆడి ఉండాల్సిందని ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ త‌రుపున అడిన మిస్ట‌ర్ 360 అనూహ్య‌రీతిలో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బాయ్ చెప్పి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

దక్షిణాఫ్రికా జట్టులో అతడు లేని లోటు పూడ్చలేనిదని.. భారత జట్టులో విరాట్ కోహ్లి లేకుంటే ఎలా ఉంటుందో.. ఇప్పుడు సఫారీ జట్టు పరిస్థితి అలా ఉందంటూ గ్రేమ్‌ స్మిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం.. 2019 ప్రపంచకప్‌ వరకైనా ఏబీ డివిలియర్స్ ఆడి ఉంటే బాగుండేదని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

వెన్నునొప్పి కారణంగా కొన్నిరోజులు ఆటకి దూరమైన ఏబీ డివిలియర్స్ గత ఏడాది పునరాగమనం తర్వాత చాలా బాగా ఆడాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఏబీ ఇలా సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను ఊహించలేదు. అతను కనీసం 2019 ప్రపంచకప్‌ వరకైనా ఆడతాడని నేను భావించా. దక్షిణాఫ్రికా జట్టులో అతడు లేని లోటు పూడ్చలేదనిద‌ని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -