Friday, April 26, 2024
- Advertisement -

మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ ….మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -

విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. ఆడేది ఐదో టెస్టు మ్యాచ్‌.. అయితేనేం తొలి టెస్టు శతకాన్ని ఎలా ద్విశతకంగా మార్చుకోవాలో చేసి చూపించాడు.సెంచరీ సాధించడానికి 203 బంతులు ఎదుర్కొంటే.. దాన్ని డబుల్‌ సెంచరీగా మలుచుకోవడానికి మరో 155 బంతులు ఆడాడు. ఓవరాల్‌గా 22 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ద్విశతకం నమోదు చేశాడు.

202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ 317 పరుగుల వద్ద రోహిత్‌ వికెట్‌ను కోల్పోయింది. ఈ రోజు ఆటలో మరో 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన పుజారా కూడా నిరాశపరిచాడు.టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్‌ పుజారా(6) విఫలమైన చోట, రికార్డుల వీరుడు కోహ్లి(20) నిరాశపరిచిన వేళ.. మయాంక్‌ మాత్రం సొగసైన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ఇదే సమయంలో కెప్టెన్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు.20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి పెవిలియన్‌ చేరాడు. దాంతో భారత జట్టు 377 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ సెనురాన్‌ ముత్తుసామీ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రెండో షెషన్ ముగిసిన తర్వాత టీమిండియా ఇన్నీంగ్ష్ ను డిక్లర్ చేసె అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి కోహ్లీసేన 382 పరుగులు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -