Friday, April 26, 2024
- Advertisement -

టెస్ట్ మ్యాచ్ రేపనంగా భారత్ కు రెండో బిగ్ షాక్…మరో ఆల్ రౌండర్ ఔట్

- Advertisement -

సఫారీలతో టెస్ట్ మ్యాచ్ రేపు ప్రారంభం కానుండగా కోహ్లీసేనకు మరో ఎదురు దెబ్బ తగిలింది.ఇప్పటికే వెన్ను ముక గాయం కారణంగా బూమ్రా జట్టుకు దూరమయ్యారు. మెరుగైన వైద్యం కోసం లండ్ ను వెల్లనున్నారు. ఇప్పుడు మరో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా గాయం కారణంగా సిరీస్ కు దూరమయ్యారు.

గత ఏడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో బౌలింగ్ చేస్తూ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. బంతి విసిరిన తర్వాత వెన్ను నొప్పితో మైదానంలోనే కుప్పకూలిన హార్దిక్‌ని స్ట్రెచర్‌పై వెలుపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది. చికిత్స అనంతరం మళ్లీ జట్టులోకి వచ్చాడు.ఇటీవల సఫారీలతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లోనూ ఈ ఆల్‌రౌండర్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. వె అతడి వెన్నుపూస క్రింది భాగంలో గాయం తిరగబెట్టినట్లు సమాచారం.

వెన్ను గాయానికి మెరుగైన చికిత్స కోసం జస్‌ప్రీత్ బుమ్రాని బ్రిటన్‌కి పంపాలని బీసీసీఐ సోమవారం నిర్ణయించగా.. తాజాగా హార్దిక్ పాండ్యా కూడా చికిత్స కోసం అక్కడికే వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే.. నవంబరు ఆరంభం నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న సిరీస్‌కి ఈ ఆల్‌రౌండర్ దూరంకానున్నాడు.

అయితే హార్ధిక్ ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటాడో తెలియదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన తర్వాతనే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.హార్థిక్ సర్జరీ జరిగే అవకాశం ఉందని అదే జరిగితే ఆరు నెలలు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -