Friday, April 26, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో తిరుగులేని టీమిండియా…విండీస్‌ను చిత్తు చేసిన కోహ్లీసేన‌..

- Advertisement -

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ లో భార‌త విజ‌య యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. పరీక్ష పెడుతున్న పిచ్‌పై పరిస్థితుల కు ఎదురొడ్డి నిలిచిన భారత బ్యా ట్స్‌మెన్ పోరాడే స్కోరు చేయడం తోపాటు.. బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మాంచెస్టర్ లో వెస్టిండీస్ తో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌ నుంచి మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ నిష్క్రమించింది. వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో ఉంది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (82 బంతుల్లో 72; 8 ఫోర్లు), మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (61 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా.. లోకేశ్ రాహుల్ (64 బంతుల్లో 48; 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (38 బంతు ల్లో 46; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.

విండీస్ బౌలర్లలో రోచ్ (3/36), హోల్డర్ (2/33) నిప్పులు చెరిగారు. అనంతరం లక్ష్య ఛేదనలో షమీ (4/16), బుమ్రా (2/9), చహల్ (2/39) బెంబేలెత్తించడంతో వెస్టిండీస్ 34.2 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. అంబ్రీస్ (31) టాప్‌స్కోరర్. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

టీమిండియా నిర్దేశించిన 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్‌ జట్టు 34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు మహ్మద్‌ షమీ(4/16) విండీస్‌ పతనాన్ని శాసించగా.. బుమ్రా(2/9), చహల్‌(2/39)లు రాణించారు. విండీస్‌ ఆటగాళ్లలో సునీల్‌ అంబ్రొస్‌(31), నికోలస్‌ పూరన్‌(28)లు మినహా ఎవరూ రాణించలేకపోయారు.

ఓపెనర్ క్రిస్‌గేల్ (6) ఆరంభంలోనే ఔటవగా.. షైహోప్ (5), నికోలస్ పూరన్ (28), హిట్‌మెయర్ (18), సునీల్ ఆంబ్రిస్ (31), జేసన్ హోల్డర్ (6), బ్రాత్‌వైట్ (1) తక్కువ స్కోరుకే వికెట్లు చేజార్చుకున్నారు. దీంతో.. ఆ జట్టు 34.2 ఓవర్లలోనే 143 పరుగులకి ఆలౌటైపోయింది.

టోర్నీలో తాజాగా ఐదో విజయంతో సెమీస్ ముంగిట భారత్ నిలవగా.. ఐదో పరాజయంతో సెమీస్ రేసు నుంచి వెస్టిండీస్ జట్టు నిష్క్రమించింది. భారత్ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్‌లో గెలిచినా.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌కి అర్హత సాధిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -