ఈ సారి సీరియస్ గా ఆడుతాం : కోహ్లీ

719
india captain virat kohli says his team will take things more seriously
india captain virat kohli says his team will take things more seriously

టీమిండియా సారథిగా విరాట్ కోహ్లీ పగ్గాలు తీసుకున్న తర్వాత అన్ని ఫార్మాట్లలో తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. అటు కెఫ్టెన్ గా తన బాధ్యత వహిస్తునే.. ఇటు ప్లేయర్ గా కూడా రికార్డులు బద్దలు కొడుతూ.. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఒక్క ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. గతేడాది వన్డే, టెస్టుల్లో సత్తాచాటామంటున్న కోహ్లీ.. పొట్టిఫార్మాట్‌లో అంతగా రాణించలేదని తెలిపాడు.

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న వేళ ఆటను చాలా సీరియస్ గా తీసుకుంటామని.. అన్ని విధాలుగా రెడీ అవుతామని కోహ్లీ తెలిపాడు. ఆదివారం శ్రీలంకతో గువాహటిలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ.. వచ్చే మెగాటోర్నీకి సంబంధించిన ప్రణాళికలను వివరించాడు. ఇక భారత్ తరపున కోహ్లీ ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. గతేడాడి వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరడమే కోహ్లీ కెప్టెన్సీలో అతిపెద్ధ ఘనత.

ఇంకోవైపు కోహ్లీకి ముందు కెఫ్టెన్ గా వ్యవహరించిన ధోనీ అత్యంత విజయవంతమైన ఇండియన్ కెప్టెన్‌గా నిలిచాడు. 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఇలా మూడు మెగాటోర్నీలను సాధించిన ఏకైక భారత సారథిగా రికార్డ్ సాధించాడు. వచ్చే అక్టోబర్ నుంచి టీ20 వరల్డ్‌కప్ ఉండటంతో ఈసారి ఎలాగైన మెగాటోర్నీని సాధించాలని కోహ్లీ ప్రణాళికలు వేస్తున్నాడు.

Loading...