Saturday, April 27, 2024
- Advertisement -

పూణే మూడో టెస్ట్‌లో భారత్ టార్టెగ్..284

- Advertisement -

పూణె వన్డేలో విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగుల స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయానికి న్యాయం చేస్తూ బుమ్రా ఆరంభంలోనే అదరగొట్టాడు. తక్కువ స్కోర్‌కే ఓపెనర్లు ఇద్దరూ బుమ్రా బౌలింగ్‌లోనే అవుటై పెవిలియన్ చేరారు.

షై హోప్ (95: 113 బంతుల్లో 6×4, 3×6) ప‌రుగులు, హిట్‌మెయర్ (37: 21 బంతుల్లో 2×4, 3×6), నర్స్ (40 నాటౌట్: 20 బంతుల్లో 4×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. దాదాపు నెల తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చిన భుననేశ్వర్ 10 ఓవర్లు వేసి ఏకంగా 70 పరుగులు సమర్పించుకోగా.. జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం 35 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు.

25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన విండీస్… 38 పరుగుల వద్ద రెండో వికెట్ చేజార్చుకుంది. చంద్రపాల్ హేమ్‌రాజ్ 15 పరుగులు చేయగా, కిరాన్ పోవెల్ 21,మార్లోన్ శామ్యూల్స్ 9 పరుగులు చేసి అవుటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే హెట్మయర్‌ను అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్…పావెల్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. 121 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన విండీస్ జట్టు కష్టాల్లో పడింది.

అయితే ఆరో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన కెప్టెన్ జాసన్ హోల్డర్, వికెట్ కీపర్ షై హోప్ జట్టును ఆదుకున్నారు. జాసన్ హోల్డర్ (32 పరుగులు), అలెన్ (5 పరుగులు) చేసి అవుటయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ధాటిగా బ్యాటింగ్ చేసిన విండీస్ వికెట్ కీపర్ షై హోప్‌… 113 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 95 పరుగులు చేసి శతకం మిస్ అయ్యాడు. 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన నర్సును బుమ్రా అవుట్ చేయగా… 19 బంతుల్లో ఓ ఫోరు, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన రోచ్ నాటౌట్‌గా నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -