Friday, April 26, 2024
- Advertisement -

మిథాలీ రాజ్ పై ఇంటర్నెట్ లో విమర్శలు.. హుందాగా కౌంట‌ర్ ఇచ్చిన క్రికెట‌ర్‌

- Advertisement -

భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పై నెటిజన్ ఒకరు గురువారం మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాకుండా మిథాలీ రాజ్ ఒకరోజు ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పడమే ఇందుకు కారణం. దీనికి కారణం చెబుతూ మిథాలీ సూపర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి

ప్రస్తుతం టీ20 చాలెంజర్స్ టోర్నీలో ఆడుతున్న మిథాలీ ఆగస్టు 15న కాకుండా మరుసటి రోజు దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ‘మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం కోసం చాలామంది ప్రాణత్యాగం చేశారు. వారి ఆత్మ బలిదానాలను గౌరవిద్దాం. పేదరికం, ఆకలి, వివక్ష, లైంగిక వేధింపుల నుంచి దేశం స్వేచ్ఛ పొందాలని ఆశిద్దాం. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్’ అని ట్వీట్ చేసింది.

నాకు సెలబ్రిటీ హోదా ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. 1999 నుంచి నేను క్రీడాకారిణిగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. ప్రస్తుతం నేను చాలెంజర్స్‌ ట్రోఫీలో ఆడుతున్నాను. మైదానంలో ఉన్నంతసేపు మా వద్ద ఫోన్‌ ఉండదు. మ్యాచ్‌ జరిగే సమయంలో నేను ఫోన్‌ ఉపయోగించను. అందుకే ఆలస్యమైంది. నా ఈ కారణాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అని మిథాలీ వివరణ ఇచ్చారు. ఈ వివరణపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -