Saturday, April 20, 2024
- Advertisement -

క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన మిథాలి రాజ్!

- Advertisement -

క్రికెట్ రంగంలో కెప్టెన్‌ మిథాలి రాజ్‌ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ తన చివరి సిరీస్‌ అని టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌ మిథాలి రాజ్‌ పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో న్యూజిలాండ్ లో ప్రపంచ కప్ క్రికెట్ పోటీ జరగనుండగా, ఆపై ఆటకు వీడ్కోలు పలికే చాన్స్ ఉందని ఆమె తెలిపింది. దాదాపు 21 సంవత్సరాల కెరీర్ ను తాను పూర్తి చేసుకున్నానని, 2022 తన కెరీర్ కు చివరి సంవత్సరం కావచ్చని వెల్లడించింది.

‘1971 ది బిగినింగ్‌ ఆఫ్‌ ఇండియా క్రికెటింగ్‌ గ్రేట్‌నెస్‌’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం (వర్చువల్‌ పద్ధతి)లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2022లో న్యూజిలాండ్‌లో జరిగే ప్రపంచకప్‌ తన చివరి సిరీస్‌ అని స్పష్టం చేశారు. ఆమె రిటైర్మెంట్‌పై గతంలో చాలా సార్లు వార్తలు వచ్చినా ఏనాడూ స్పందించలేదు. కానీ ఇప్పుడు మిథాలీనే స్వయంగా తన వీడ్కోలుపై స్పష్టత ఇచ్చింది. వన్డే ప్రపంచకప్‌ ముందు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలు ఉన్నాయి.

అలాగే మధ్యలో వెస్టిండీస్‌తో హోమ్‌ సిరీస్‌ కూడా ఉంది. ఇవన్నీ తెలిసి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యం’ అని మిథాలి చెప్పుకొచ్చారు. ఇకపై జరిగే ప్రతి సిరీస్‌ తనకెంతో ముఖ్యమని, అవి జట్టును బలంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోపడతాయని టీమ్‌ఇండియా కెప్టెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, ప్రస్తుతం 38 సంవత్సరాల వయసులో ఉన్న మిథాలీ రాజ్, ఇంతవరకూ 10 టెస్టులు, 214 వన్డేలు 89 టీ-20 మ్యాచ్లు ఆడింది. ఇక, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ గవాస్కర్, మిథాలీ బృందం విరాట్ కోహ్లీ టీమ్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

దేశంలో లాక్ డౌన్ కొనసాగింపు టెన్షన్..?

నేటి పంచాంగం, ఆదివారం (25-04-2021)

ఆడపిల్ల పుట్టిందని ఏకంగా హెలికాప్టర్ లోనే ఇంటికి తీసుకు వచ్చారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -