మళ్లీ బ్యాట్ పట్టిన ధోనీ.. రీ ఎంట్రీ రెడీ..!

887
ms dhoni starts practicing with jharkhand ranji squad after omission from bcci
ms dhoni starts practicing with jharkhand ranji squad after omission from bcci

వన్డే వరల్డ్‌కప్ తర్వాత సీనియర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దాదాపు 6 నెలలు క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవలే ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. బీసీసీఐ కాంట్రాక్టులో ధోనీకి చోటు దక్కలేదని అతని అభిమానులు గోల చేస్తుంటే.. ఇవన్నీ పంటించుకోని ధోనీ మాత్రం రీ ఎంట్రీ కోసం ప్లాన్స్ ప్రారంభించాడు.

5 కోట్ల విలువ గల కాంట్రాక్ట్‌లో చోటు కోల్పోయిన రోజే మైదానంలోకి అడుగుపెట్టాడు. తన స్వస్థలం రాంచీలో జార్ఖండ్‌ రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. బ్యాటింగ్‌తో పాటు రెగ్యులర్‌ ట్రైనింగ్‌లో కూడా అతను పాల్గొన్నట్లు జార్ఖండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. అయితే ఐపీఎల్‌ కోసమే అతను ప్రాక్టీస్‌లో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టులో ధోనికి చోటు దక్కలేదు. గతేడాది ఎ గ్రేడ్‌లో ఉన్న ఈ మిస్టర్ కూల్‌కు ఈ సారి ఎలాంటి గ్రేడ్ దక్కలేదు. బీసీసీఐ కాంట్రాక్టుల ప్రకారం ఎ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాడికి రూ. 7 కోట్లు, ఎ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ.3 కోట్లు, సి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఒక కోటి చొప్పున వేతనం లభిస్తుంది.

Loading...