Friday, April 26, 2024
- Advertisement -

11 పరుగులు చేస్తే.. కోహ్లీ ఖాతలో మరో అద్భుతమైన రికార్డు..!

- Advertisement -

శుక్రవారం వెల్లింగ్‌టన్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. వన్డేల్లో విఫలం అయిన భారత్.. టెస్టుల్లో రాణించాలని చూస్తోంది. టీమిండియా కెఫ్టెన్ కోహ్లీ ఖాతలో ఇప్పటికే చాలా రికార్డులు ఉన్నాయి. ఇక ఇప్పుడు సౌరవ్ గంగూలీ రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. ఈ తొలి టెస్టులో కేవలం 11 పరుగులు చేస్తే గంగూలీని కోహ్లీ అధిగమించనున్నాడు.

అంతేకాకుండా అత్య‌ధిక టెస్టు ప‌రుగులు చేసిన ఆరో భార‌త క్రికెటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 7,202 ప‌రుగులతో ఉన్నాడు. గంగూలీ (7,212) ని అధిగమించి మరో 11 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు బాదిన ఆరో భార‌త క్రికెట‌ర్‌గా నిలుస్తాడు. కోహ్లీ 84 మ్యాచ్‌లలో 7,202 ప‌రుగులు చేయగా.. గంగూలీ 113 టెస్టుల్లో 7,212 ప‌రుగులు చేశాడు. ఇక అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నారు.

200 టెస్టుల్లో 15,921 ప‌రుగులు చేసాడు. ఈ జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌ (13,288), సునిల్‌ గవాస్కర్ (10,122), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (8,718), వీరేంద్ర సెహ్వాగ్‌ (8,586)లు ఉన్నారు. ఆ తర్వాత దాదా, కోహ్లీలు ఉన్నారు. ఇక న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టెస్టులో దాదాని కోహ్లీ అధిగమిస్తాడని భావిస్తున్నారంతా. ఇక వన్డే సిరీస్ లో సరిగ్గా పరుగులు చేయలేకపోయినా కోహ్లీకి ఈ టెస్టు సీరిస్ సవాల్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -