Friday, April 26, 2024
- Advertisement -

యూసుఫ్‌ పఠాన్‌, రహానే మధ్య గొడవ.. ఏమైంది ?

- Advertisement -

క్రికెట్‌లో అంపైరింగ్‌ ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. అంపైర్ల తప్పుడు నిర్ణయాల కారణంగా ఆటగాళ్లుకు సమస్య ఏర్పడుతోంది. తాజాగా రంజీ ట్రోఫీలో ఓ అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా టీమిండియా క్రికెటర్ల మధ్య మాటల యుద్దం జరిగింది. ముంబయి, బరోడా జట్ల మధ్య గురువారం నాలుగో ఆట జరిగింది. బరోడా బ్యాట్స్‌మన్‌ యూసుఫ్‌ పఠాన్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి ఔటయ్యాడు.

ముంబయి ఆఫ్‌ స్పిన్నర్‌ శశాంక్‌ వేసిన ఓ బంతిని పఠాన్‌ డిఫెన్స్‌ ఆడబోగా ఆ బంతి బౌన్స్‌ తీసుకొని అతడి ఛాతికి తగిలి గాల్లోకి లేచింది. వెంటనే షార్ట్‌ లెగ్‌ వద్ద ఉన్న ఫీల్డర్‌ జై బిస్టా బంతిని అందుకోవడంతో ముంబయి జట్టు అప్పీల్‌ చేసింది. అంపైర్‌ ఔటివ్వడంతో ఆశ్యర్యపోయిన పఠాన్‌ క్రీజు వీడకుండా అలాగే నిల్చున్నాడు. అదే సమయంలో ముంబయి ఆటగాళ్లు వికెట్‌ తీసిన ఆనందంలో మునిగిపోయారు.

ఇంకా అంపైర్లు ఒకరికొకరు దగ్గరకు రాగా ..ముంబై కెప్టెన్‌ రహనే బ్యాట్స్‌మన్‌ పఠాన్‌ దగ్గరికి వచ్చి ఏదో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ టైంలో ముంబయి కీపర్.. రహానెను పక్కకు తీసుకెళ్లడంతో పఠాన్‌ క్రీజు వీడాడు. ఇక ఈ మ్యాచ్ లో బరోడా 309 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. లక్ష్య ఛేదనలో బరోడా 224 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ముంబయి ఆటగాడు పృథ్వీ షా డబుల్‌ సెంచరీ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -