Friday, May 3, 2024
- Advertisement -

కళా వెంకటరావు చేసిన తప్పేంటి?

- Advertisement -

మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు అరెస్టు అక్రమమని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ఈ చర్యకు నిరసనగా.. నేడు టిడిపి శ్రేణులంతా రోడ్డెక్కి నిరసనలు తెలపాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. “వైసిపి అరాచాకాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు జరపాలి.. కళా వెంకట్రావు సహా టిడిపి శ్రేణులపై వైసిపి అరాచకాలను ఖండించాలి” అని పార్టీ శ్రేణులకు టెలీ కాన్ఫరెన్స్​లో దిశానిర్దేశం చేశారు.

వైసిపికు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఘాటుగా విమర్శించారు. సైకో చేష్టలకు కళా వెంకట్రావు అరెస్టు పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు. నేటి నుంచి టిడిపి ధర్మ పరిరక్షణ యాత్ర తొలిదశ ప్రారంభం కానున్న సందర్భంగా.. తిరుపతి నుంచి మెుదలుకానున్న యాత్ర ఈ నెల 31 వరకు 700 గ్రామాల్లో జరగనుందన్నారు. తెలుగుదేశం పార్టీ పోరాటం ధర్మ పరిరక్షణ కోసమనీ.. టిడిపి పోరాటం రాష్ట్ర ప్రజలు, మత సామరస్యం, బడుగు బలహీన వర్గాల కోసమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జరిగే అరాచకాలు ఉన్మాది పాలనను తలపిస్తున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేత కళా వెంకట్రావు చేసిన తప్పేంటని.. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -