Saturday, May 4, 2024
- Advertisement -

లాక్ డౌన్ లో భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అదేనంట?

- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. తెలుగుతెరపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ “బద్రి” తరువాత పూరి జగన్నాథ్ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలకు దర్శకత్వం వహించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.అలాగే పూరి జగన్నాథ్ ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్స్ ను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

పూరి జగన్నాథ్ తరుచు తనకు తెలిసిన విషయాలను యూట్యూబ్ ఛానల్ లో “పూరి మ్యూజింగ్స్” పేరిట అభిమానులతో పంచుకుంటూన్న విషయం తెలిసిందే. తాజాగా వివాహబంధాన్ని, విడాకులకు గల కారణాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాడు.అందుకు ఉదాహరణ చెబుతూ లాక్ డౌన్ కి ముందు కొత్త గా పెళ్ళైన ఓ జంట హనీమూన్ కి మాల్దీవులకు వెళ్లారని, ఐతే లాక్ డౌన్ కారణంగా వారు కొంతకాలం దీవిలో గడపాల్సి వచ్చింది. లాక్ డౌన్ పూర్తి అయ్యి వారు బయటకు వచ్చిన వెంటనే విడాకులు తీసుకున్నారని చెప్పారు. ఇందుకు కారణాన్ని వివరిస్తూ లాక్ డౌన్ కారణంగా భార్య భర్తలు రాత్రి, పగలు తేడా లేకుండా ఒకే చోట ఉండాల్సి రావడంతోనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

Also read:ఆ అస్లీల వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ ఏడ్చేసిన హీరోయిన్!

కరోనా మహమ్మారి కారణం అమెరికా, చైనా వంటి దేశాల్లో ఎప్పుడు లేని విధం గా డివోర్స్ రేటు 122 శాతం పెరిగిందన్నారు. సహజంగా భార్యా భర్తలు ఒకరితో ఒకరు అరగంట కంటే ఎక్కువ మాట్లాడుకోలేరని. మిగతా సమయాన్ని టివి చూస్తూనో,వాట్సాప్ చూసుకుంటూనో గడపడం మంచిది అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Also read:రాజమౌళి షార్ట్ ఫిలిం.. ఆర్ఆర్ఆర్ కంటే ముందే విడుదల!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -